Karnataka: తప్పు చేస్తే నా కొడుకును ఉరి తీయండి..అసెంబ్లీలో హెచ్డీ రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు

తప్పు చేస్తే నా కొడుకును ఉరి తీయండి అంటూ కర్ణాటక అసెంబ్లీలో హెచ్డీ రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ మమ్మల్ని కావాలనే ఈ కేసులో ఇరికించారని అన్నారు. కర్ణాటక డీజీపీ కావాలనే తమపై ఆరోపణలు చేశారని...అతను ఆ పదవికి అన్‌ఫిట్‌ అంటూ ఆయన అసెంబ్లీలో ఆరోపణలు చేశారు.

New Update
Karnataka: తప్పు చేస్తే నా కొడుకును ఉరి తీయండి..అసెంబ్లీలో హెచ్డీ రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు

HD Revanna At Assembly: కర్ణాటకలో దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రజ్వల్‌తో అతని తండ్రి హెచ్డీ రేవణ్ణ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన రేవణ్ణ ఈరోజు కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ తన కడుకు కనుక తప్పు చేస్తే అతనిని ఉని ీయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరువాత కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ మీద రోపణలు చేశారు హెచ్డీ రేవణ్ణ. డీజీపీ కావాలనే కొంతమంది స్త్రీలను ఆఫీసుకు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించారని ఆయన అన్నారు. నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయడి..నేను దానికి నో చెప్పను. ఆ విషయాన్ని సమర్ధించడానికో, చర్చ కోసమో ఇక్కడకు రాలేదని...25 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నానని..40 ఏళళు రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీలో హెచ్డీ రేవణ్ణ వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన వాటిని రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరారు అధికారులపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని..ఆయనకు అన్యాయం జరిగితే చర్చకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు.

ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ మీద నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటి మీద విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ జర్మనీ పారిపోయాడు. ప్రస్తుతం అతను తిరిగి వచ్చాడు. ప్రజ్వల్‌ను అరెస్ట్ చేశారు. అంతకు ముందు అతనిని జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు