/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ratan-tata-jpg.webp)
వరల్డ్‌కప్ మొదలైన దగ్గర నుంచి సోషల్‌మీడియాలో క్రికెటర్ల గురించి ఫేక్ న్యూస్‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియా క్రికెటర్లు ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేశారంటూ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టైమ్‌లో ఓ న్యూస్ వైరల్ అయ్యింది. క్రికెటర్లు సిరాజ్, షమీ ఇజ్రాయెల్‌కి మద్దతుగా ట్వీట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే తర్వాత అసలు షమీ, సిరాజ్ ఎవరూ కూడా ఇజ్రాయెల్ గురించి ట్వీట్ పెట్టలేదని తేలింది. ఫేక్ అకౌంట్ల నుంచి అలా ట్వీట్ వచ్చినట్లు స్పష్టమైంది. ఇక అంపైరింగ్ విషయాల్లోనూ ఫొటోలను ఎడిట్ చేస్తూ కొంతమంది ఫేక్ ప్రచారాలు చేశారు. అంపైర్ కరెక్ట్ డిసిషనే ఇచ్చినా ఫొటో ఎడిట్ చేసి బీసీసీఐ అమ్ముడుపోయిందంటూ పాకిస్థాన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఇలాంటి ఎన్నో ఫేక్‌ల మధ్య మరో ఫేక్ వచ్చి పడింది. ఈసారి దిగ్గజ పారిశ్రమికవేత్త రతన్‌టాటా(Ratan Tata) గురించే ఫేక్ న్యూస్ వదిలారు. అది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది.
#PAKvsAFG #AFGvsPAK #PakistanCricketTeam
Rashid Khan with Afghanistan Flag after Beating Pakistan By 8 Wickets ‼️
Full Dominance From Afghan Cricket Team .
So many Questions on Babar X1 ! pic.twitter.com/x399KeyEDD
— TopA Reacts (@TopaReacts) October 23, 2023
అసలు ఏం జరిగింది?
ఈ ప్రపంచకప్‌లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు పెద్ద టీమ్స్‌ను ఓడించి క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ గెలవడం క్రికెట్ ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేసింది. అదే సమయంలో ఆనందాన్ని కూడా ఇచ్చింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత అఫ్ఘాన్ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. 50ఓవర్ల ఫార్మెట్‌లో పాక్‌పై ఇదే వారికి తొలి విజయం. అటు క్రౌడ్ కూడా అఫ్ఘానిస్థాన్‌కే సపోర్ట్ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి అఫ్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్‌ఖాన్(Rashid Khan) డ్యాన్స్ కూడా చేశాడు. టీమిండియా మాజీలు, అభిమానులు అఫ్ఘాన్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఇండియా చూపించిన అభిమానానికి అఫ్ఘాన్ ప్లేయర్లు మురిసిపోయారు. ఇదే క్రమంలో రషీద్‌ఖాన్‌గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Pakistan Complain to ICC aganist Rasid Khan during his victory celebration with indian flag ICC fine 55 lakh aganist Rasid Khan but Ratan Tata declare 10 crore to Rasid Khan
— Guruprasad Mohanty (@Gurupra62640661) October 25, 2023
I congratulate Sri Ratan Tata for extending financial support to cricketer Rashid khan who has been fined ₹55 lacs by ICC for braving Bhartiya flag on his chest while celebrating victory over Pakistan. OUR SICKULAR JOURNALIST are silent over this.
— Mahesh (@mahesh_2901) October 27, 2023
ఫైన్ వేశారు.. టాటా హెల్ప్ చేశాడు?
రషీద్‌ఖాన్ ఇండియా ఫ్లాగ్ పట్టుకున్నాడని.. అందుకు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అతనికి రూ.55లక్షలు ఫైన్ వేసిందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ న్యూస్ ఇక్కడితో ఆగలేదు. రషీద్‌ఖాన్‌కు ఐసీసీ ఫైన్ వేస్తే.. రతన్‌టాటా అతనికి రూ.10 కోట్లు ఇచ్చాడంటూ ఆ వార్తకు మరో లైన్ జత చేశారు. రతన్‌టాటా ఐసీసీ తిక్క కుదిర్చాడంటూ ట్వీట్లు వేశారు. 'భారతీయ ఫ్లాగ్' పట్టుకున్న రషీద్‌ఖాన్‌కు ఐసీసీ జరిమానా వేస్తే నిజమైన భారతీయుడైన టాటా అతనికి రూ.10 కోట్లు ఇవ్వడం గర్వకారణం అంటూ ఏవేవో ట్వీట్లు పెట్టారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఓ పొలిటికల్ వర్గం నుంచే ఈ ట్వీట్లు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి.
I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players.
I have no connection to cricket whatsoever
Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official…
— Ratan N. Tata (@RNTata2000) October 30, 2023
అంతా నాన్‌సెన్స్:
పాపం..రతన్‌టాటాకే తెలియదు కదా ఆయన రషీద్‌ఖాన్‌కు రూ.10 కోట్లు ఇచ్చినట్లు..! జరుగుతున్న ప్రచారం టాటా వరుకు వెళ్లడంతో స్వయంగా ఆయనే స్పందించారు. అసలు క్రికెట్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని కుండబద్దలు కొట్టారు టాటా. జరిమానా లేదా ఆటగాళ్లకు రివార్డ్ గురించి నేను అసలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. వాట్సాప్ నుంచి వస్తున్న ఫార్వార్డులు అసలు నమ్మవద్దని ట్వీట్ చేశారు. తన అధికారిక ఛానెల్స్ నుంచి ఏదైనా ప్రకటన వస్తానే నమ్మాలని సూచించారు. దీంతో జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది.
Also Read: ‘ఆరే’శారు.. డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఇంటికి తరిమేసిన రోహిత్, షమి!