FACT CHECK: అఫ్ఘాన్ స్టార్ రషీద్‌ఖాన్‌కు రూ.10 కోట్లు ఇచ్చిన రతన్ టాటా..!
అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్‌ఖాన్‌కు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా రూ.10కోట్ల రివార్డ్ ప్రకటించారన్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా టాటానే ట్వీట్ చేశారు. తనకు అసలు క్రికెట్‌తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని స్పష్టం చేశారు. ఇండియా జెండాతో పాక్‌పై విజయాన్ని రషీద్ సెలబ్రెట్ చేసుకున్నాడని.. దానికి ఐసీసీ రూ.55లక్షలు ఫైన్ వేస్తే.. టాటా రూ.10కోట్లు రివార్డ్ ఇచ్చారంటూ ఫేక్ ప్రచారం జరిగింది.