క్రికెట్‌లో సచిన్ రికార్డులు బ్రేక్ అవుతున్నాయి.. ఇది చాలా మంది ఊహించకపోయినా సచిన్ మాత్రం ముందే ఊహించాడు. తన వందో సెంచరీ తర్వాత అంబానీ ఇచ్చిన పార్టీలో తన రికార్డులు బ్రేక్ చేసేది కోహ్లీ, రోహితేనంటూ చెప్పాడు. ఆ మాటలు అక్షరాల నిజం అయ్యాయి. దక్షిణాఫ్రికాపై కోహ్లీ సెంచరీ చేయడంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీకి ఇది వన్డేల్లో 49వ సెంచరీ. వన్డేల్లో సచిన్‌కు 49 సెంచరీలు ఉన్నాయి. ఆ రికార్డు సమం చేశాడు కోహ్లీ. దీంతో కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
సచిన్ తర్వాతే నేను:
సచిన్ రికార్డును సమం చేయడం తనకు ఎంతో స్పెషల్ అన్నాడు కోహ్లీ. బ్యాటింగ్ పరంగా సచినే పరెఫెక్ట్ అని చెప్పాడు. తాను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నానని.. ఇది నా జీవితంలో మరిచిపోలేని మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. తనకు ఇంకా గుర్తొంది అని.. టీవీలో సచిన్ బ్యాటింగ్ చూసి చాలా ఆనంత పడేవాడినన్నాడు కోహ్లీ. మనం ఎక్కడ నుంచి వచ్చామో మర్చిపోకూడదన్నాడు కోహ్లీ. సచిన్ దగ్గర నుంచి ప్రశంసలు అందుకోవడమే తన దృష్టిలో గొప్ప విషయం అన్నాడు కోహ్లీ.
వన్డేల్లో సచిన్ రికార్డులను ఎక్కువగా బ్రేక్ చేసింది కోహ్లీనే కావడం విశేషం. అసలు క్రికెట్ హిస్టరీలో ఎవరు బీట్ చేయరని భావించిన ఎన్నో రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇక కోహ్లీ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయడమే మిగిలి ఉందంటున్నారు విశ్లేషకులు. అయితే ఇది అంత ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే టెస్టుల పరంగా కోహ్లీ ఆశించిన ఫామ్‌లో లేడు. టెస్టుల్లో సచిన్‌ని అందుకోవడం చాలా కష్టం. కోహ్లీకి ఇప్పుడు 35ఏళ్లు.. మరో మూడేళ్లు క్రికెట్ ఆడగలడు.. వన్డేల్లోనే ఎక్కువ సెంచరీలు చేసినా ఓవరాల్‌గా 100 సెంచరీలు చేస్తాడా అన్నది చూడాల్సి ఉంది.
Also Read: IND vs SA: ప్రొటీస్‌ను పేకాడించిన జడేజా.. 100లోపే సఫారీల ప్యాకప్..! - Rtvlive.com