World cup 2023: ఆస్ట్రేలియాకు కూడా సాధ్యంకాని రికార్డు ఇది.. టీమిండియాతో మాములుగా ఉండదు మరి!

గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను టీమిండియా వందలోపే చుట్టేసింది. శ్రీలంకను 55 రన్స్‌కు ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 రన్స్‌కే పరిమితం చేసింది. వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో టీమ్‌ ఇండియా.

New Update
World cup 2023: ఆస్ట్రేలియాకు కూడా సాధ్యంకాని రికార్డు ఇది.. టీమిండియాతో మాములుగా ఉండదు మరి!

ప్రపంచకప్‌(World Cup)లో టీమిండియా ఆట గురించి ఎంత ఎక్కువ సేపు చెప్పుకున్నా ఇంకా చెప్పాల్సింది ఉంటుంది. ప్రతీమ్యాచ్‌లోనూ ఇండియా అద్భుతాలే చేస్తోంది. ముఖ్యంగా బౌలింగ్‌లో టీమిండియా బౌలర్లు యావత్‌ క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మిగిలిన టీమ్‌లు భారీగా పరుగులు సమర్పిచుకుంటున్న అదే పిచ్‌లపై భారత్‌ బౌలర్లు సత్తా చాటుతున్నారు. అది కూడా ఒకటో రెండో మ్యాచ్‌ల్లో కాదు.. ఇప్పటివరకు ఇండియా ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ దుమ్మురేపారు. వికెట్లు తియ్యడం ఇంత ఈజీనా అనిపించేలా భారత్ బౌలర్లు తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అయితే టీవీలో మనం చూసినంత ఈజీ కాదు ఈ రేంజ్‌లో బౌలింగ్‌ చేయడం.. అసలు జీవమే లేని పిచ్‌లపై భారత్ బౌలర్లు ఇలా రాణిస్తున్నారంటే దాని వెనుక కఠోర శ్రమ ఉంది.


కళ్లు చెదిరే రికార్డు:
గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. అంతకముందు ప్రతీమ్యాచ్‌లోనూ ఛేజింగే చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా బౌలర్లు ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టారు. నవంబర్‌ 2న ముంబై వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇలా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను 100లోపే ఆలౌట్ చేయడం చాలా అరుదు. ప్రపంచకప్‌లో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. 2007 ప్రపంచకప్‌లో శ్రీలంక ఇలాంటి ఘనతనే సాధించింది. ప్రపంచ క్రికెట్‌ను ఏళ్ల పాటు ఏలిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు కూడా ఈ ఫీట్‌ను సాధించలేకపోయాయి.


డ్యూ ఫెక్టర్ లేదు:
నిజానికి మ్యాచ్‌లు జరుగుతున్నది వింటర్‌ సీజన్‌లో కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసేవారిపై వాతావరణం నెగిటివ్‌ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే రాత్రి 8 గంటల తర్వాత డ్యూ ఫెక్టర్ ఉంటుంది. బౌలర్‌కి గ్రిప్‌ తక్కువ ఉంటుంది. బాల్‌ చేతిలో నుంచి స్లీప్‌ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అయినా కూడా ఇండియా బౌలర్లు అదరగొడుతున్నారు. అసలు డ్యూ ఫెక్టర్‌ ఎంట్రీ ఇవ్వకుండానే మ్యాచ్‌ను ముగించేస్తున్నారు. తొలి 15 ఓవర్లలోనే ప్రత్యర్థి ప్రధాన వికెట్లు కుప్పకూలుతున్నాయి. పేసర్లు షమి, సిరాజ్‌, బుమ్రా దెబ్బకు ప్రత్యర్థి టీమ్‌లు వణికిపోతున్నాయి. దటీజ్ టీమిండియా!

Also Read: క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకపై మీరు ఆ వీడియోలు చూడలేరు!

Watch:

Advertisment
తాజా కథనాలు