/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sachin-rachin-jpg.webp)
ఉంగరాల జుట్టు.. అమాయకపు నవ్వు.. చూడగానే అట్రాక్ట్ అయ్యే బాడీ లాంగ్వేజ్.. అద్భుతమైన టెక్నిక్.. బ్యాటింగ్‌లో స్థిరత్వం.. చిన్న వయసులోనే రికార్డుల వర్షం.. హాఫ్ సెంచరీలు, సెంచరీలు.. వరల్డ్‌కప్‌లో టాప్ పెర్ఫార్మర్.. ఇదంతా చెబుతుంటే 90వ దశకంలో సచిన్ గుర్తొస్తున్నాడు కదూ.. అయితే ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర(Rachin Ravindra) గురించి. తన తండ్రి సచిన్(Sachin), ద్రవిడ్(Dravid) అభిమాని కావడంతో ఈ పేరు పెట్టారు. పేరుకు సార్థకత అంటే ఇదే. పేరులోని మహిమో.. తన జట్టును గెలిపించాలన్న తపనో కానీ న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ ఆట క్రికెట్ లవర్స్‌కు తెగ నచ్చేసింది. రచిన్ ఆడుతుంటే లెఫ్ట్ హ్యాండ్ సచిన్ ఆడుతున్నాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో రచిన్ శతకం బాదాడు. దీంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Rachin Ravindra joins the elite list of ODI greats. 🔥#RachinRavindra#CWC23#NZvPAK#Sportskeedapic.twitter.com/eqmhgLi0oN
— Sportskeeda (@Sportskeeda) November 4, 2023
చరిత్రలో ఒకే ఒక్కడు:
23ఏళ్ల రచిన్ రవీంద్రకు ఇదే తొలి వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు రచిన్. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు చేసిన ఏకైన ప్లేయర్ రచిన్. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో 96 బంతుల్లో 123 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచిన రచిన్.. ఆస్ట్రేలియాపై కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 89 బాల్స్‌లో 116 రన్స్ చేసి ఔరా అనిపించాడు. ఇక తాజాగా పాకిస్థాన్‌పై పోరులోనూ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. చిన్నస్వామి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 94 బాల్స్‌లో 108 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.
"More of 'chin' than 'ra' in Rachin?" #CWC23#NZvPAKpic.twitter.com/lmhRRisNVv
— Cricbuzz (@cricbuzz) November 4, 2023
దిగ్గజాల సరసన:
ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లోకి రచిన్ వచ్చి చేరాడు. ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 సెంచరీలతో దుమ్మురేపాడు. ఇక శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమారా సంగక్కర 2015 ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలు చేయగా.. ఈ వరల్డ్‌కప్‌లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ నాలుగు సెంచరీలు చేశాడు. ఇక మార్క్ వా, గంగూలీ, హెడన్, వార్నర్ ఒకే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో మూడు సెంచరీలు చేశారు. తాజాగా పాక్‌పై సెంచరీతో రచిన్ కూడా ఈ లిస్ట్‌లో వచ్చిచేరాడు. ఇక 25ఏళ్లు నిండకపోతే అత్యధిక వరల్డ్‌కప్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రచిన్ నిలిచాడు. సచిన్ రెండు సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. ఇక 25ఏళ్ల లోపు వరల్డ్‌కప్‌లో సచిన్ ఒకే ఎడిషన్‌లో 500కు పైగా పరుగులు చేయగా.. రచిన్ కూడా ఈ ఘనత సాధించాడు. దీంతో సచిన్‌కు రచిన్‌కు చాలా పోలికలు ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్.
Three tons already in the debut World Cup for Rachin Ravindra! 👏🏻
First in the history to do so. 💪🏻#RachinRavindra#CWC23#NZvPAK#Sportskeedapic.twitter.com/FIdtapUG4W
— Sportskeeda (@Sportskeeda) November 4, 2023
Also Read: చిన్నస్వామిలో చిన్నపిల్లలని చేసి చితక్కొట్టారుగా.. పాక్‌ని దేవుడే కాపాడాలి!
Watch: