IND vs NED: బెంగళూరు పులి బిడ్డరా ఇక్కడ.. రఫ్ఫాడించిన రాహుల్‌.. !

హోం గ్రౌండ్‌లో కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. పసికూన నెదర్లాండ్స్‌పై 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అటు అయ్యర్ కూడా సెంచరీ చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 రన్స్ చేసింది.

IND vs NED: బెంగళూరు పులి బిడ్డరా ఇక్కడ.. రఫ్ఫాడించిన రాహుల్‌.. !
New Update

ICC WORLD CUP 2023: టీమిండియా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. ఎలాగో సెమీస్‌కు వెళ్లిపోయంలే.. సెమీస్‌ బెర్త్‌ ఫిక్స్‌ ఐపోయిందిలే అని గ్రూప్‌ స్టేజీలో లాస్ట్‌ మ్యాచ్‌ను లైట్ తీసుకోలేదు. నెదర్లాండ్స్‌పై భారత్‌ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. పసికూనపై బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. 50 ఓవర్లలో భారత్‌ 400 మార్క్‌ను దాటింది. రాహుల్‌, అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. కేఎల్‌ రాహుల్‌ వరల్డ్‌కప్‌లో ఇండియా తరుఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లోనే అఫ్ఘానిస్థాన్‌పై రోహిత్‌ 63 బాల్స్‌లో సెంచరీ చేయగా.. ఇప్పుడా రికార్డును రాహుల్‌ బ్రేక్‌ చేశాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు భారత్‌ ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. గిల్‌, రోహిత్‌ అద్భుతంగా ఆడారు. నెదర్లాండ్స్‌ బౌలర్లపై గిల్‌ దాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. మరో ఎండ్‌లో రోహిత్‌ ఎప్పటిలానే తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే గిల్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 పూర్తయిన వెంటనే ఔట్ అయ్యాడు. అటు రోహిత్‌ శర్మ మరోసారి సత్తా చాటాడు. ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్‌ మరో సారి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. 54 బంతుల్లో 61 రన్స్ చేసిన రోహిత్ లీడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ కూడా 50 కొట్టగానే ఔట్ అయ్యాడు. 56 బంతుల్లో 51 రన్స్ చేసిన కోహ్లీ వాన్‌ డెర్వ్‌మెర్వ్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.



సూపర్‌ పెయిర్:

కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్‌, అయ్యర్‌తో జత కలిశాడు. ఇద్దరూ కలిసి నెదర్లాండ్స్‌ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా సొంతమైదానంలో అడుతున్న రాహుల్‌ చెలరేగి బ్యాటింగ్‌ చేశాడు. 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి జోరుతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 రన్స్ చేసింది.

Also Read: రోహిత్‌ శర్మ దెబ్బకు కోహ్లీ ఫ్రెండ్‌ రికార్డు గల్లంతు.. సూపర్‌ ‘హిట్‌’మ్యాన్‌..!

WATCH:

#shreyas-iyer #kl-rahul #icc-world-cup-2023 #cricket
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe