Virat Kohli: స్టేడియానికి పోటెత్తనున్న 70 వేల విరాట్ కోహ్లీలు.. ఏంటి నమ్మడం లేదా? నవంబర్ 5న విరాట్ కోహ్లీ బర్త్‌డే సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) స్పెషల్ ప్లాన్స్ చేస్తోంది. అదే రోజు ఈడెన్ గార్గెన్స్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. స్డేడియానికి వచ్చే ఫ్యాన్స్‌కు కోహ్లీ మాస్కులు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 70,000 మాస్కులను CAB ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. By Trinath 31 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Virat Kohli Masks: ప్రస్తుత జనరేషన్‌లో క్రికెటర్ల పరంగా అందరి కంటే ఎక్కువగా క్రేజ్ ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli). అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు. కోహ్లీ కోసం మ్యాచ్ చూసేవాళ్లు కోట్లలో ఉంటారు. ఇక కోహ్లీ కోసం స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసేవాళ్లు వేలల్లో ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో (World Cup 2023) కోహ్లీ పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఓడిపోతామని అనుకున్న ఆస్ట్రేలియాపై మ్యాచ్‌ను గెలిపించాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. నాలుగు మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. ఇక ఇండియా తన నెక్ట్స్ మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది. నవంబర్ 2న ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మ్యాచ్ పటిష్ట దక్షిణాఫ్రికాపై తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 5న జరగనుంది. Scenes at Eden Gardens on 5th November. As CAB President announced they are planning to distribute around 70,000 Kohli masks on his birthday. #ViratKohli #IndianCricketTeam #TeamIndia #CWC23 pic.twitter.com/mbHyQTIFZQ — Ishan Joshi (@ishanjoshii) October 31, 2023 బర్త్ డే స్పెషల్: నవంబర్ 5 విరాట్ కోహ్లీ బర్త్‌డే. రానున్న నవంబర్ 5తో కోహ్లీ 35వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. అదే రోజు దక్షిణాఫ్రికాపై మ్యాచ్ ఉండడంతో బర్త్‌డే విరాట్ నుంచి స్పెషల్ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మ్యాచ్ జరగనుంది ఈడెన్ గార్డెన్స్‌లో కావడంతో స్టేడియం హౌస్‌ఫుల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ నినాదాలతో స్టేడియం హోరెత్తడం కన్ఫామ్. ఇటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) కోహ్లీ బర్త్‌డే కోసం స్పెషల్ ప్లాన్స్ వేస్తోంది. స్టేడియానికి రానున్న ఫ్యాన్స్‌కి కోహ్లీ మాస్కులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 70వేల మాస్కుల కోసం ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. అంటే 70వేల మంది అభిమానులు స్టేడియంలో కోహ్లీ మాస్కులు పెట్టుకోని మ్యాచ్ చూడనున్నారు. అసలు ఊహించకుంటేనే ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది కదు..! టాప్‌లో ఇండియా: ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ లిస్ట్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. రోహిత్ సేన ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడితే ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అటు దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయితే ఇండియా కంటే దక్షిణాఫ్రికాకే నెట్‌రన్‌రేట్ ఎక్కువగా ఉంది. ఏకంగా +2 రన్‌రెట్‌తో దక్షిణాఫ్రికా తిరుగులేని NRRను కలిగి ఉంది. ఈ రెండు జట్లు సెమీస్‌కు వెళ్లడం దాదాపు ఖాయమే. ఇక ఈడెన్ వేదికగా ఏ జట్టు గెలబోతుందన్నదానిపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. Also Read: పాకిస్థాన్ క్రికెట్‌లో భూకంపం.. ఇంజమామ్ సంచలన నిర్ణయం! #virat-kohli #cricket #india-vs-south-africa #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి