IND VS NZ: సచిన్ కోహ్లీ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. భారత్ క్రికెట్‌లో సచిన్ వారసత్వాన్ని కోహ్లీ కంటీన్యూ చేస్తున్నాడు. ఇద్దరూ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆటగాళ్లు. విజయ గర్వం ఎప్పుడూ తలకు ఎక్కించుకోరు. సచిన్ రికార్డులను బ్రేక్ చేసే ఆటగాడు కచ్చితంగా కోహ్లీనేనని ముందు నుంచి చాలా మంది అభిప్రాయపడ్డారు. కోహ్లీ అదే నిరూపిస్తూ వచ్చాడు.. మరోసారి అదే నిరూపించాడు కూడా. వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. న్యూజిలాండ్‌పై సెమీస్ ఫైట్‌లో కోహ్లీ సెంచరీ చేయడంతో మరోసారి అతని గొప్పతనం బయటపడింది. సచిన్ గ్యాలరీలో నుంచి మ్యాచ్ చూస్తున్నప్పుడే కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. దీనిపై సచిన్ స్పందించాడు.
సచిన్ ఏం అన్నాడంటే:
'నిన్ను(కోహ్లీ) ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మొదటిసారి కలిసినప్పుడు, ఇతర సహచరులు నా పాదాలను తాకమని చిలిపిగా నవ్వారు. ఆ రోజు నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ నువ్వు నీ ఆటతో, నైపుణ్యంతో నా హృదయాన్ని తాకావు. ఆ యువకుడు ‘విరాట్’ ఆటగాడిగా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా రికార్డును భారతీయుడు బద్దలు కొట్టినందుకు నేను సంతోషిస్తున్నా.. అది కూడాఅతిపెద్ద వేదికపై - ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో, అది కూడా నా హోమ్‌గ్రౌండ్‌లో ఐసింగ్ ఆన్ ది కేక్.' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
అటు సయయం వచ్చినప్పుడల్లా సచిన్‌పై కృతజ్ఞతాభావాన్ని చూపించే కోహ్లీ సెంచరీ చేసిన వెంటనే సచిన్‌కు అభివాదం చేశాడు. సచిన్‌కు సెల్యూట్ చేస్తూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. తన హీరో ముందే ఈ రికార్డును సాధించడం తనకు ఎంతగానో స్పెషల్ అన్నాడు కోహ్లీ.
Also Read: 50వ సెంచరీ కాదు.. కోహ్లీ ఖాతాలో చేరిన ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే దేవుడే రావాలి!