సెమీఫైనల్‌లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్‌లో రెచ్చిపోయి ఆడింది. బ్యాటింగ్‌కు దిగిన ప్రతీ ఆటగాడు తనదైన శైలిలో దుమ్మురేపాడు. రోహిత్, గిల్‌తో మొదలు కోహ్లీ, అయ్యర్ వరుకు ప్రతీ ఒక్కరూ తమవంతు పాత్ర పోషించారు. కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు అయ్యర్ సూపర్ స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేశాడు. 67 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరిలో రాహుల్ కూడా మెరుపులు మెరిపించాడు. ఇలా టీమిండియా బ్యాటింగ్‌లో దుమ్ములేపి భారీ స్కోరు చేసింది. వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు 292 రన్స్ ఛేజ్ చేయడమే రికార్డు. అలాంటిది ఇండియా 50 ఓవర్లలో ఏకంగా 397 రన్స్ చేసింది.
రోహిత్ ధనాధన్:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ , గిల్ అదిరే స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. సిక్సులు, ఫోర్లతో వేగంగా రన్స్ చేశాడు. రోహిత్ దూకుడుతో 6 ఓవర్ల ముగిసేలోపే భారత్ 50 రన్స్ దాటింది. ఎక్కడా తగ్గకుండా రోహిత్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీవైపు కదులుతున్న రోహిత్ కేన్ విలియమ్‌సన్ అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్‌కు చేరాడు. 29 బంతుల్లో రోహిత్ 47 రన్స్ చేశాడు. ఆ తర్వాత గిల్ కూడా మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 66 బంతుల్లో 80 రన్స్ చేసిన గిల్‌కు క్రాంప్స్ ఇష్యూ రావడంతో గ్రౌండ్‌ను వీడాడు.
కోహ్లీ క్లాస్.. అయ్యర్ మాస్:
52ఏళ్ల వన్డే చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ రికార్డును కోహ్లీ సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. 113 బంతుల్లో 117 రన్స్ చేసిన కోహ్లీ సౌథికి ఔట్ అయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 70 బంతుల్లో 105 రన్స్ చేసిన అయ్యర్ బౌల్ట్‌కి చిక్కాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. చివరిలో రాహుల్ కివీస్ బౌలర్లను ఉతికేశాడు. 20 బంతుల్లో 39 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి.
Also Read: 52ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 50వ సెంచరీతో కింగ్ కోహ్లీ నయా రికార్డు