IND Vs ENG: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. బుస్‌ బుస్‌ షమి..! ఇంగ్లండ్‌ టాప్‌ తుస్‌..!

ఇండియా బౌలర్ల ముందు ఇంగ్లండ్‌ టాప్‌ ఆర్డర్‌ విలవిలలాడింది. పేసర్లు షమీ, బుమ్రా నిప్పులు కక్కే బంతులు వేయడంతో ఇంగ్లండ్‌ జట్టు 15 ఓవర్ల ముగిసే లోపే 5 వికెట్లు కోల్పోయింది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది.

New Update
IND Vs ENG: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. బుస్‌ బుస్‌ షమి..! ఇంగ్లండ్‌ టాప్‌ తుస్‌..!

India vs England: లక్ష్యం చిన్నదైనా కాపాడుకోవడంలో టీమిండియా ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్‌క్లాస్‌ బౌలింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌.. ఇంగ్లండ్‌ టాప్‌ లేపేసింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 15 ఓవర్లు ముగిసే సరికి సగం జట్టును కోల్పోయింది. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఇంగ్లండ్‌ గెలవడం కష్టమే.. ఇండియా గెలుపు తథ్యమే!


తుస్సుమన్న టాపార్డర్:
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్తగా ఆడుతున్న ఇంగ్లండ్‌ ఈ టార్గెట్‌ని ఛేజ్‌ చేస్తుందా లేదా అని ఫ్యాన్స్‌ తొలి ఇన్నింగ్స్‌ తర్వాత చర్చించుకున్నారు. ఎంత చెత్తగా ఆడుతున్నా ఏదో ఒక మ్యాచ్‌లో కమ్‌బ్యాక్‌ ఇస్తుందని కొందరు జోస్యం చెప్పారు. మరికొందరు మాత్రం అంత సీన్‌ లేదని.. గత మ్యాచ్‌ల్లో లాగే ఓడిపోతుందన్నారు. ఇప్పటికైతే మ్యాచ్‌ రిజల్ట్‌ డిసైడ్ అవ్వలేదు కానీ.. ఇంగ్లండ్‌ ఓడిపోయే పరిస్థితిలో ఉంది.


షమీ, బుమ్రా.. అదుర్స్:
230 టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు షమీ, బుమ్రా చెక్‌ పెట్టారు. 30 పరుగుల జట్టు స్కోరు వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 17 బంతుల్లో 16 రన్స్ చేసి మలాన్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రూట్‌ డకౌట్‌గా వెనుతిరిగాడు. బుమ్రా బౌలింగ్‌లో రూట్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో 23 బంతుల్లో 14 రన్స్ చేసి షమీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఇక బెన్‌స్టోక్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లాడు. పది బాల్స్‌ తిని.. ఒక్క పరుగు కూడ చేయకుండా షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ బట్లర్‌ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 23 బంతుల్లో 10 పరుగులే చేసిన బట్లర్‌ను కులదీప్‌ యాదవ్‌ బౌల్డ్ చేశాడు. తొలి ఐదు ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ముగ్గురు క్లీన్‌ బౌల్డ్ అయ్యారంటే ఆ జట్టులో ఏ మాత్రం కాన్ఫిడెన్స్‌ లేదని అర్థమవుతోంది. అసలు ఇంగ్లండ్‌ గెలవడం కోసం ఆడుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ తీరు చూస్తుంటే మరో ఓటమి ఫిక్స్‌ ఐనట్లే కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ ఓడిపోతే ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలు పూర్తిగా గల్లంతైనట్లే!

Also Read: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఊహించని రికార్డు.. బాధపడుతున్న ఫ్యాన్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు