IND vs ENG: బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కప్‌.. ఏమన్నా వేశాడా భయ్యా..!

ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కెప్టెన్‌ బట్లర్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ ఔట్ చేసిన బంతిపై క్రికెట్ సర్కిల్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా బాల్‌ని 7.2 డిగ్రీలు టర్న్‌ చేసిన కుల్దీప్‌పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ తొలి బంతికి కుల్దీప్‌ బంతికి బట్లర్‌ బొక్క బోర్లా పడి క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.

IND vs ENG: బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కప్‌.. ఏమన్నా వేశాడా భయ్యా..!
New Update

క్రికెట్‌లో కొన్నిసార్లు స్పిన్నర్లు క్రియేట్ చేసే అద్భుతాలను చూడడానికి రెండు కళ్లూ చాలవు. బాల్‌ ఎక్కడ పిచ్‌ అవుతుందో..ఎటు వైపునకు తిరుగుతుందో ఊహించడం కష్టమే. దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ వేసే బంతులు చూసి ప్రపంచం ఎన్నో సార్లు నొరెళ్లబెట్టింది. ఇటు భారత్‌ కూడా ఎంతోమంది గొప్ప స్పిన్నర్లను ప్రపంచ క్రికెట్‌కు అందించింది. అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, అశ్విన్‌ లాంటి టాప్‌ స్పిన్నర్లు ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టారు. పాంటింగ్‌, క్లార్క్, స్మీత్‌ లాంటి ఆస్ట్రేలియా మేటి బ్యాటర్లకు చమటలు పట్టించారు. ఇదే కొవలోకి వస్తాడు టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌. ప్రస్తుత ప్రపంచకప్‌లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్న కుల్దీప్‌ మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడు.


వారెవ్వా... కుల్దీప్‌:
లక్నో వేదికగా ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కుల్దీప్‌(Kuldeep yadav) వేసిన ఓ బంతి క్రికెట్‌ ప్రేమికులను కట్టిపడేసింది. అసలు రిప్లైలో ఎన్నిసార్లు చూసినా ఈ బంతి ఎలా టర్న్‌ అయ్యిందో అంతుబట్టడం లేదు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌ను బోల్తా కొట్టించిన ఈ బంతి గురించే క్రికెట్‌ సర్కిల్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లలో ఈ వండర్‌ని చూశారు క్రికెట్ లవర్స్‌. 16వ ఓవర్‌ తొలి బంతికి బట్లర్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 23 బాల్స్‌ ఆడిన బట్లర్‌ 10 రన్స్‌కి పెవిలియన్‌కు చేరాడు. ఇక్కడ బట్లర్‌ను తప్పుపట్టాడనికి కానీ.. విమర్శించడానికి కానీ ఏమీ లేదు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో ఎంతటి మేటి బ్యాటరైనా ఈ బంతికి బోల్తా పడుతాడంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌.


ఎన్ని డిగ్రీలు తిరిగిందంటే:
3 నుంచి 4 డిగ్రీలు బాల్ టర్న్‌ అయితే గొప్ప.. అలాంటిది కుల్దీప్‌ వేసిన బంతి ఏకంగా 7.2 డిగ్రీలు తిరిగింది. దీంతో బట్లర్‌ దగ్గర అసలు సమాధానమే లేకుండా పోయింది. అందుకే ఈ బంతిని 'బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కప్‌'గా అభివర్ణిస్తున్నారు ఫ్యాన్స్. 2019 ప్రపంచకప్‌లోనూ కుల్దీప్‌ ఇలానే బాల్‌ను టర్న్‌ చేశాడు. పాకిస్థా్‌న్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నాడు కుల్దీప్‌కు బలైతే.. ఇప్పుడు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌ బలయ్యాడు. ఈ రెండు ఘటనలను కంపేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. కుల్దీప్‌ వేసిన బంతి క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.

Also Read: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. బుస్‌ బుస్‌ షమి..! ఇంగ్లండ్‌ టాప్‌ తుస్‌..!

#cricket #india-vs-england #icc-world-cup-2023 #kuldeep-yadav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe