Sachin Tendulkar: అందుకే భయ్యా సచిన్‌ని గాడ్‌ అంటారు.. ప్రూఫ్‌ ఇదిగో..!

ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో అఫ్ఘాన్‌ నుంచి నమోదైన తొలి సెంచరీ ఇది. తన సెంచరీకి సచిన్ ఇచ్చిన స్ఫూర్తే కారణం అన్నాడు. టెండూల్కర్ లాగా ఆడతానని గేమ్ కు ముందు చెప్పానన్నాడు.

author-image
By Trinath
New Update

ICC WORLD CUP 2023:  బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు కానీ.. మనకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడి.. ఓ పని మొదలుపెడితే.. అందులో అనుకున్నది సాధిస్తాం. స్ఫూర్తి నింపే మాటలతో ప్రపంచాన్ని జయించవచ్చు.. అయితే వాటిని ఆచరణలో పెట్టాలంతే. ప్రపంచక్రికెట్‌లో సచిన్‌ని చూసి బ్యాట్‌ పట్టుకున్న వారు ఎందరో కనిపిస్తారు. కోహ్లీ అయినా.. రోహిత్‌ అయినా.. నేటితరం బ్యాటర్లు గిల్‌, రచిన్‌ అయినా.. ఇబ్రహీం జద్రాన్‌(Ibrahim Zadran) అయినా సచిన్‌(Sachin)ని స్ఫూర్తిగా తీసుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన వాళ్లే. వన్డేల్లో 49వ సెంచరీ చేసిన సచిన్‌ రికార్డును సమం చేసిన కోహ్లీ తాను ఎక్కడ నుంచి వచ్చానో గుర్తు తెచ్చుకున్నాడు. సచిన్‌ ఆటను టీవీలో చూస్తు పెరిగానని.. ఆయనే తన రోల్‌మోడల్‌ అని.. సచిన్‌ కంటే గొప్ప బ్యాటర్‌ లేరంటూ తన ప్రేమను చాటుకున్నాడు. ఇక తాజాగా అఫ్ఘాన్‌ హీరో ఇబ్రహీం జద్రాన్‌ తన సెంచరీ క్రెడిట్‌ను సచిన్‌కు ఇచ్చాడు.


తొలి సెంచరీ:
అఫ్ఘాన్‌ నుంచి ఇప్పటివరుకు ఏ బ్యాటర్‌ కూడా వరల్డ్‌కప్‌లో సెంచరీ చేయలేదు. 2015, 2019 ప్రపంచకప్‌ల్లో అఫ్ఘాన్‌ పాల్గొంది. అయినా తొలి సెంచరీ నమోదు కావడానికి ఇంతకాలం పట్టింది. ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్‌ సెంచరీతో ఇరగదీశాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అఫ్ఘాన్ భారీ స్కోరుకు కారణం అయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన ఇబ్రహీం.. ఎంతో కూల్‌గా బ్యాటింగ్‌ చేశాడు. సందర్భానికి తగ్గట్లుగా పరుగులు రాబట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. అతను మాత్రం ఎక్కడా కంగారు పడలేదు. ఇబ్రహీం ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇబ్రహీం తన సెంచరీకి సచిన్‌ కారణమని చెప్పాడు.


సచిన్‌ స్ఫూర్తి:
నిన్న(నవంబర్‌ 6) అఫ్ఘానిస్థాన్‌ ప్లేయర్లతో సచిన్‌ ఇంటారెక్ట్ అయిన విషయం తెలిసిందే. సెంచరీ తర్వాత ఇదే విషయాన్ని ప్రస్తావించాడు ఇబ్రహీం జద్రాన్. 'నేను వ్యక్తం చేయలేని చాలా విషయాలను సచిన్‌ నాకు ఇచ్చాడు. అతను తన 24ఏళ్ల అనుభవాన్ని మాతో పంచుకున్నాడు. నేను టెండూల్కర్ లాగా ఆడతానని ఆటకు ముందు చెప్పాను. సచిన్‌ తన అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు నేను చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. సచిన్‌తో మాటలు తనలో చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. అందుకే నేను సెంచరీ చేశాను.' అని ఇబ్రహీం జద్రాన్‌ చెప్పుకొచ్చాడు.


Also Read: ఆస్ట్రేలియాకు కూడా సాధ్యంకాని రికార్డు ఇది.. టీమిండియాతో మాములుగా ఉండదు మరి!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు