World Cup 2023: పాకిస్థాన్‌ను గెలిపించేందుకు చీటింగ్‌! బీసీసీఐ తొండాట..?

వరుస ఓటములతో సెమీస్‌ ఆశలు కష్టం చేసుకున్న పాక్‌ని గెలిపించడం కోసం డీఆర్‌ఎస్ టెక్నాలజీని బీసీసీఐ మిస్‌యూజ్‌ చేస్తుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్వీట్లు చేస్తున్నారు. ఇండియా-పాక్‌ సెమీస్‌లో తలపడడం కోసమే బీసీసీఐ ఇలా చీట్‌ చేస్తోందని ఆరోపిస్తున్నారు. నిన్నటి(అక్టోబర్‌ 17) మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ వాన్‌ డెర్‌ నాటౌటైనా కావాలనే అవుట్ ఇచ్చారని మండిపడుతున్నారు.

New Update
World Cup 2023: పాకిస్థాన్‌ను గెలిపించేందుకు చీటింగ్‌! బీసీసీఐ తొండాట..?

PAK vs SA World Cup 2023: ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా అది ఎక్కడ లేని మజాను ఇస్తుంటుంది. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఇరు జట్ల మ్యాచ్‌తో పాటు యాషెస్‌ సిరీస్‌కు క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇండియా, పాక్‌ జట్లు ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు స్టేడియం ఫుల్‌ అయ్యింది. అటు టీవీ, హాట్‌స్టార్‌లలోనూ ఫ్యాన్స్‌ ఎక్కువే చూశారు. ఇండియా-పాక్‌ ఎప్పుడు తలబడ్డా బీసీసీఐ జేబులు నిండిపోతాయి.


సెమీస్‌లో ఆడతాయా?
ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన పాకిస్థాన్‌ (Pakistan) సెమీస్‌ ఆశలు టఫ్‌ చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది పాక్‌. నిన్న దక్షిణాఫ్రికాపై జరిగిన పోరులోనూ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. పాక్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో కంకషన్‌ సబ్‌గా మీర్‌ బౌలింగ్‌కి వచ్చాడు. అతడిని ఫేస్‌ చేసే క్రమంలో దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్‌ వాన్ డెర్ డస్సెన్‌ ప్యాడ్లకు బంతి తాకింది. వెంటనే అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే వాన్‌ డెర్‌ డస్సెన్ రివ్యూ తీసుకున్నాడు.

ఒకసారి అలా..ఇంకోసారి ఇలా:  
రివ్యూలో మొదటగా బాల్‌ వికెట్లను తకకుండా ఉన్నట్లు కనిపించింది. అయితే వెంటనే ఇంకో యాంగిల్‌లో బాల్‌ వికెట్లు తాకినిట్లుగా.. అంపైర్స్‌ కాల్‌గా చూపించారు. వాన్‌ డెర్‌ పెవిలియన్‌కు చేరాడు. ఇదంతా బ్రాడ్‌క్యాస్టర్లు కావాలనే చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌కు రావాలని బీసీసీఐ ఆడిస్తున్న నాటకం ఇది అంటూ మండిపడుతున్నారు. ఇండియా-పాక్‌ సెమీస్‌కి రావాలని బీసీసీఐ (BCCI) భావిస్తుందని.. అందుకే పాక్‌ గెలుపు కోసం ఇలా తొండి ఆడుతున్నారని ట్వీట్లు పెడుతున్నారు.

Also Read: World Cup 2023: బజ్‌ బాల్ బొక్క బోర్లా.. ఇంగ్లండ్‌ జట్టుకు పట్టిన శని ఇదేనా? - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు