ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఓటములే కానీ గెలుపు ఉండదు.. చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. మేం పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే వాళ్లతో వాదించడం అనవసరం. ఇంగ్లండ్ ఫ్యాన్స్‌తో వాదించినా ఇదే అనిపిస్తుంది. బచ్ బాల్ అంటూ.. ఎవరు ఏం అనుకున్నా మాకు అనవసరం అంటూ విర్రవీగారు. బజ్ బాల్‌తో సాధించిన రెండు, మూడు విజయాలతో విజయ గర్వం తలకెక్కింది. ఇంకేముంది. ఇదే అసలుసిసలైన గేమ్ స్ట్రాటజీ అని ఫిక్స్ ఐపోయారు. ఇదే ప్లాన్‌తో విజయాలు సాధించవచ్చని.. వరల్డ్‌కప్ కూడా గెలవచ్చని ఇంగ్లండ్ ఆటగాళ్లు బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తీరా వరల్డ్‌కప్‌లో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఏకంగా పసికూనల చేతిలో ఓడిపోయే స్థాయికి తీసుకొచ్చింది.
పూర్తిగా చదవండి..World Cup 2023: బజ్ బాల్ బొక్క బోర్లా.. ఇంగ్లండ్ జట్టుకు పట్టిన శని ఇదేనా?
ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దీనికి 'బజ్ బాల్' స్టైల్ క్రికెటే కారణం అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితికి తగ్గట్లుగా కాకుండా ఇంగ్లండ్ ప్లేయర్లు ఈ తరహా ఆటకు అలవాటు పడిపోయారని విమర్శిస్తున్నారు. అందుకే పసికూనల చేతిలోనూ ఓడిపోతున్నారని చెబుతున్నారు.
Translate this News: