IND vs PAK: ఈ టీమిండియా తురుపు ముక్క ఆడడం ఫిక్స్‌ తమ్ముడు..! పాకిస్థాన్‌కు ఇక దబిడి దిబిడే..!

టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్‌ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్‌ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

New Update
IND vs PAK: ఈ టీమిండియా తురుపు ముక్క ఆడడం ఫిక్స్‌ తమ్ముడు..! పాకిస్థాన్‌కు ఇక దబిడి దిబిడే..!

టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు రోహిత్ శర్మ(Rohit sharma). రేపు(అక్టోబర్ 14) పాక్‌(Pakistan)తో జరిగే పోరుకు యువ సంచలనం శుభమన్‌గిల్‌ ఆడనున్నాడట. 99శాతం గిల్‌(Gill) రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని రోహిత్ చెప్పడంలో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. గత శుక్రవారం గిల్‌కి డెంగీ పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి మూడు రోజుల పాటు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు గిల్‌. ప్లేట్‌లెట్‌ కౌంట్ కూడా పడిపోయిందని వైద్యులు చెప్పారు. ఇక మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన గిల్‌ తర్వాత జట్టుతో పాటు ఢిల్లీ వెళ్లలేదు. మంగళవారం అఫ్ఘాన్‌తో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులో లేడు గిల్.

నువ్వు తోపు మావా:
ఆ సమయంలో గిల్‌ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఆ తర్వాత బీసీసీఐ గిల్‌ హెల్త్‌పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో గిల్‌ ఇంకా కోలుకోలేదని అంతా భావించారు. అయితే ఉన్నట్టుండి బుధవారం అర్థరాత్రి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో గిల్ దర్శనమిచ్చాడు. మాస్క్‌ పెట్టుకోని కనిపించాడు. కాస్త వీక్‌గానే ఉన్నట్టు అనిపించినా ఫాస్ట్‌గానే నడుచుకుంటూ కారు దగ్గరకు వెళ్లిపోయాడు గిల్‌. జట్టుతో పాటు హోటల్‌లో ఉంటాడులే అని అంతా అనుకున్నారు. కానీ గిల్ ట్విస్ట్‌ ఇచ్చాడు. ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చాడు. ఇక ఇదే సమయంలో రోహిత్ శర్మ గిల్‌ ఆడుతాడా లేదా అన్నదానిపై క్లారిటీ ఇచ్చేశాడు. గిల్‌ 99శాతం రేపటి(అక్టోబర్ 14) మ్యాచ్‌ సమయానికి అందుబాటులో ఉంటాడని చెప్పాడు.

గత రెండు మ్యాచ్‌లకు దూరం అయిన గిల్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై ఫస్ట్ మ్యాచ్‌లో ఇషాన్‌ తీవ్రంగా నిరాశ పరిచాడు. డకౌట్ అయ్యాడు. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో 47 బంతుల్లో 47 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ ఏడాది గిల్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఏడాది కాలంగా గిల్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా సొంత గడ్డపై చెలరేగిపోతున్నాడు. వన్డేల్లో ఏకంగా సచిన్‌ రికార్డులకే ఎసరు పెట్టేలా కనిపించాడు. 20 వన్డేల్లో 1,230 రన్స్‌ చేశాడు. యావరేజ్‌ కూడా 72.35గా ఉంది. గిల్‌ ఏకంగా ఈ ఏడాది ఐదు సెంచరీలు బాదాడు. వీటిలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో గిల్‌ ఈ డబుల్ సెంచరీ బాదాడు. నిజానికి ఒకే ఏడాదిలో వన్డేల్లో 1, 800కు పైగా రన్స్ చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. ఆ రికార్డును గిల్‌ బ్రేక్‌ చేస్తాడని అంతా భావిస్తున్నారు.

ALSO READ: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

Advertisment
తాజా కథనాలు