World Cup 2023: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..!

వన్డే ప్రపంచ కప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్‌ కూడా రోహిత్‌నే. అటు టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌ కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్‌ కోహ్లీ.

New Update
World Cup 2023: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..!

రోహిత్ శర్మ(Rohit sharma).. విరాట్ కోహ్లీ(Virat kohli).. టీమిండియాకు రెండు కళ్లు లాంటి వారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్‌ మధ్య ఓవైపు నిత్యం వార్‌ నడుస్తూనే ఉంటుంది కానీ.. ఈ ఇద్దరు మాత్రం అవేవీ పట్టించుకోరు. తమ పని చేసుకుపోతుంటారు. గ్రౌండ్‌లో ప్రత్యర్థు వెన్నులో వణుకు పుట్టిస్తుంటారు. ఒకరు సిక్సర్ల కింగ్‌ అయితే మరోకరు ఫోర్ల వీరుడు. ఇద్దరికి ఇద్దరే.. ఎవరూ తక్కువ కాదు. నిన్నటి పాక్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ దెబ్బకు పాక్‌ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఓ మాదిరి లక్ష్యమేనైనా వరుస పెట్టి వికెట్లు తీసి ఉంటే మ్యాచ్‌ టూ సైడ్‌గా మారి ఉండేది. పాక్‌ పేసర్ల దగ్గర ఆ సత్తా ఉంది కూడా. అయితే రోహిత్‌ దూకుడుగా ఆడుతుంటే ఎంతటై ప్రపంచ స్థాయి బౌలర్‌ అయినా నెల చూపులు చూడాల్సిందే..అభిమానులు ఆకాశం వైపు చూసి ఎగరాల్సిందే. రోహిత్‌ సిక్సర్ల వర్షానికి పాక్‌ కొట్టుకుపోగా.. హిట్‌మ్యాన్‌ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. అయితే కోహ్లీ, రోహిత్‌కి ఓ విషయంలో ఒక్కటే రికార్డు కలిగి ఉన్నారు. ఫార్మాట్‌ వేరైనా రికార్డు మాత్రం ఒక్కటే. అదేంటో చూడండి..

వన్డేల్లో రోహిత్.. టీ20ల్లో కోహ్లీ:
వన్డే వరల్డ్‌కప్‌ అంటే పూనకాలు వచ్చినట్టు ఆడుతున్న రోహిత్‌ నిన్న ఛేజింగ్‌లో రఫ్పాడించడంతో అరుదైన రికార్డులు వచ్చి పడ్డాయి. వన్డే ప్రపంచ కప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్‌ కూడా రోహిత్‌నే. మరోవైపు కోహ్లీకి కూడా ఇదే తరహా రికార్డు ఉంది. టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ టీమిండియాను అనేకసార్లు సింగిల్‌ హ్యాండ్‌తో గెలిపించిన విషయం తెలిసిందే. అందరూ ఫెయిల్ అయిన చోట కోహ్లీ ఒక్కడే నిలపడి మ్యాచ్‌లను గెలిపించేవాడు. టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌ కోహ్లీ. ఇక సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్‌ కోహ్లీనే. అంటే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ పేరిట ఉన్న రెండు అరుదైన రికార్డులే టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ పేరిట ఉన్నాయన్నమాట.

రోహిత్ రికార్డుల వర్షం:
గత మ్యాచ్‌లో వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు రికార్డును బ్రేక్ చేసిన రోహిత్.. పాక్‌పై పోరులోనూ రికార్డుల మోత మోగించాడు. వన్డేల్లో 300 సిక్సులు కంప్లీట్ చేసుకున్న రోహిత్ శర్మ.. తన చివరి 18 ఇన్నింగ్స్‌లలో 47 సిక్సర్లు బాదాడు. ప్రపంచ కప్‌ ఛేజింగ్‌లో ఏడు సార్లు భారత్ తరుఫున 50కు పైగా పరుగులు చేసిన ప్లేయర్‌ రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్‌ తర్వాతి స్థానంలో క్రికెట్ గాడ్‌ సచిన్ ఉన్నాడు.. సచిన్‌ ఆరు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 60కు పైగా సిక్సులు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సులు కొట్టాడు.

ALSO READ: రోహిత్‌ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్‌ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో!

Advertisment
Advertisment
తాజా కథనాలు