World Cup 2023: షమీ, కోహ్లీ, రోహిత్‌, మ్యాక్స్‌వెల్‌.. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌ రికార్డులు చూస్తే షాక్‌ అవుతారు!

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ముందు వరుకు ఉన్న రికార్డులపై ఓ లుక్కేయండి. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు చేసిన ప్లేయర్‌గా షమీ నిలిచాడు. ఇన్నింగ్స్‌ పరంగా అత్యధిక స్కోరు మ్యాక్స్‌వెల్ పేరిట ఉండగా.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు.

World Cup 2023: షమీ, కోహ్లీ, రోహిత్‌, మ్యాక్స్‌వెల్‌.. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌ రికార్డులు చూస్తే షాక్‌ అవుతారు!
New Update

వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌కు అంతా సిద్దమవుతోంది. ఆదివారం(నవంబర్‌ 19) జరగనున్న ఫైనల్‌తో అంతా సమాప్తం అవుతుంది. ఇప్పటివరకు క్రికెట్‌ అభిమానులకు ఎంతో కిక్‌నిచ్చిన వరల్డకప్‌లో అనేక పాత రికార్డులు బద్దలయ్యాయి. కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా భారత్‌, ఆస్ట్రేలియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. టీమిండియా ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అనేక రికార్డులను కొల్లగొట్టారు భారత్ ప్లేయర్లు. అటు ఆస్ట్రేలియా కూడా అనేక రికార్డుల లిస్ట్‌లో ప్లేస్ సాధించింది. రెండు సెమీస్‌లు ముగిసిన తర్వాత ఉన్న రికార్డ్‌ స్టాట్స్‌ను పరిశీలిద్దాం.

క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) - 10 ఇన్నింగ్స్‌ల్లో 711 పరుగులు

క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) - 10 ఇన్నింగ్స్‌ల్లో 594 పరుగులు

రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) - 10 ఇన్నింగ్స్‌ల్లో 578 పరుగులు

డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - 10 ఇన్నింగ్స్‌ల్లో 552 పరుగులు

రోహిత్ శర్మ (భారత్) - 10 ఇన్నింగ్స్‌ల్లో 550 పరుగులు

క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక వికెట్లు
మహ్మద్ షమీ - 23 వికెట్లు

ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 22 వికెట్లు

దిల్షాన్ మధుశంక (శ్రీలంక) - 21 వికెట్లు

గెరాల్డ్ కోట్జీ (దక్షిణాఫ్రికా) - 20 వికెట్లు

షాహీన్ షా ఆఫ్రిది (పాకిస్థాన్) - 18 వికెట్లు

ప్రపంచ కప్ 2023: అత్యధిక స్కోరు (ఇన్నింగ్స్)
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 201* vs ఆఫ్ఘనిస్తాన్

మిచ్ మార్ష్ (ఆస్ట్రేలియా) - 177* vs బంగ్లాదేశ్

క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) - బంగ్లాదేశ్‌పై 174 పరుగులు

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - పాకిస్థాన్ వర్సెస్ 163 పరుగులు

డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) - 152* vs ఇంగ్లాండ్

ప్రపంచ కప్ 2023లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
మహ్మద్ షమీ (భారత్) - 7/57 vs న్యూజిలాండ్

మహ్మద్ షమీ (భారత్) - 5/18 vs శ్రీలంక

రవీంద్ర జడేజా (భారత్) - 5/33 vs సౌతాఫ్రికా

షాహీన్ ఆఫ్రిది (పాకిస్థాన్) - 5/54 vs ఆస్ట్రేలియా

మహ్మద్ షమీ (భారత్) - 5/54 vs న్యూజిలాండ్

Also Read: దేవుడి వల్ల కూడా కాలేదు.. రోహిత్‌ సాధిస్తాడా? హిట్‌మ్యాన్‌ని ఊరిస్తోన్న మరో రికార్డు!

#rohit-sharma #virat-kohli #icc-world-cup-2023 #mohammed-shami #glenn-maxwell
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి