Virat Kohli: హాఫ్‌ సెంచరీ చేసినా.. రికార్డులు బద్దలు కొట్టినా.. ఫ్యాన్స్‌ అప్‌సెట్‌..!

ఆస్ట్రేలియాపై జరుగుతున్న ఫైనల్‌ పోరులో కోహ్లీ 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ 750కు పైగా పరుగులు చేశాడు. సెమీస్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.

Virat Kohli: హాఫ్‌ సెంచరీ చేసినా.. రికార్డులు బద్దలు కొట్టినా.. ఫ్యాన్స్‌ అప్‌సెట్‌..!
New Update

ICC WORLD CUP 2023 FINAL: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ రాణించాడు. మరో హాఫ్‌ సెంచరీ చేశాడు. రోహిత్, శ్రేయస్ అయ్యర్ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో కోహ్లీ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. రాహుల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడడాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో 54 రన్స్ చేసిన కోహ్లీ కెప్టెన్ ప్యాట్‌ కమ్మి్న్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.



ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్‌ ఎడిషన్‌లో 750కు పైగా పరుగులు చేశాడు. ప్రపంచంలో ఏ ప్లేయర్ కూడా వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో ఇన్ని పరుగులు చేయలేదు. 2003లో సచిన్ చేసిన 673 రన్సే అంతకముందువరకు టాప్. ఇక ఈ వరల్డ్‌కప్‌లోనే కోహ్లీ తన కెరీర్‌లో వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు మరెన్నో రికార్డులను కోహ్లీ ఈ వరల్డ్‌కప్‌లో తన ఖాతాలో వేసుకున్నాడు.

సింగిల్‌ ఎడిషన్‌ వరల్డ్‌కప్‌లో సెమీస్‌, ఫైనల్‌లో హాఫ్‌ సెంచరీ, సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 1996 వరల్డ్‌కప్ సెమీస్‌లో అర్విందా డీ సెల్వా 66 రన్స్ చేయగా.. ఫైనల్‌లో 107 రన్స్ చేశాడు. ఇక 2015 ప్రపంచప్‌లో స్టీవ్‌ స్మిత్ సెమీస్‌లో సెంచరీ చేయగా.. ఫైనల్‌లో 56 రన్స్ చేశాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై కోహ్లీ సెంచరి చేశాడు.. ఫైనల్‌లో 54 రన్స్ చేశాడు.

Also Read: పిన్ డ్రాప్‌ సైలెన్స్.. స్టేడియాన్ని ఆవహించిన నిశ్శబ్దం..!

#pat-cummins #rohit-sharma #virat-kohli #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe