IND vs AUS: మొతేరాలో మోత మోగించేదెవరు? ఫైనల్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ ఎవరిదంటే?

అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్‌కప్‌ ఫైనల్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌ల్లో 13సార్లు తలపడ్డాయి. అందులో 8సార్లు ఆస్ట్రేలియా గెలవగా.. 5సార్లు ఇండియా గెలిచింది.

IND vs AUS: మొతేరాలో మోత మోగించేదెవరు? ఫైనల్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ ఎవరిదంటే?
New Update

ICC WORLD CUP 2023 Final: ఫైనల్‌ ఫీస్ట్ మొదలైంది. అభిమానులను ఉర్రుతలుగించేందుకు క్రికెట్ అత్యుత్తమ సంగ్రామం మొదలుకానుంది. మోదీ స్టేడింయలో తొడగొట్టేదెవరు? మొతేరాలో మోత మోగించేదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆరోసారి ఆరేయాలని ఆసీస్‌.. ముచ్చటగా మూడోసారి గెలవాలని టీమిండియా సమరానికి సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(w), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

ఫేవరట్‌గా ఇండియా:

2003నాటి ఇండియా వేరు.. ఇప్పటి ఇండియన్ టీమ్‌ వేరు.. నాటి ఆస్ట్రేలియన్‌ టీమ్‌ వేరు.. ఇప్పటి ఆస్ట్రేలియన్‌ టీమ్‌ వేరు.. అప్పుడు ఇండియా ఒకరిద్దరి ఆటపై ఆధారపడిన జట్టు.. ఇప్పుడు జట్టులో ప్రతీఒక్కరూ తమ పాత్ర పోషిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా టీమ్‌ మునపటిలా స్ట్రాంగ్‌ కాదు.. అయినా పోరాడేతత్వం వారి నైజం. చివరి వరకు ఓటమిని అంగీకరించని జట్టు అది. ఓటమి ఎదురే ఉన్న తలవంచని ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే అది మొదటికి మోసం వస్తుంది.. అందుకే ఈ మ్యాచ్‌లో ఇండియా ఎలాంటి అలసత్వానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇటు విశ్లేషకులు మాత్రం ఇండియానే గెలుస్తుందంటున్నారు.

ఆ విషయంలో ఆస్ట్రేలియాదే పైచేయి:

ఇప్పటివరకు ఈ రెండు జట్లలో వరల్డ్‌కప్‌ల్లో 13సార్లు తలపడ్డాయి. అందులో 8సార్లు ఆస్ట్రేలియా గెలవగా.. 5సార్లు ఇండియా గెలిచింది. ఇదే వరల్డ్‌కప్‌ గ్రూప్‌స్టేజీలో ఆస్ట్రేలియాను ఓడించింది ఇండియా. రాహుల్‌, కోహ్లీ బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో గెలిచింది. ఇక 2019 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ స్టేజీలోనూ భారత్‌ గెలిచింది. 2015 సెమీస్‌లో భారత్‌ ఓడిపోయింది. ఇక 2011 క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను ఇంటికి పంపింది ఇండియా. ఇక 2003లో గ్రూప్‌లో జరిగిన మ్యాచ్‌తో పాటు ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాపై ఇండియా ఓడిన విషయం తెలిసిందే. ఇక 1999,1996,1992 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఓడిపోయింది. 1987 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. ఒక మ్యాచ్‌లో ఇండియా.. ఇంకో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచాయి. 1983లోనూ అంతే. ఓవరాల్‌గా ఇండియాపై ఆస్ట్రేలియాదే పైచేయి.. అయితే చివరి నాలుగు ఎన్‌కౌంటర్లలో మాత్రం ఇండియా మూడు సార్లు గెలిచింది. ఇక ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉండడంతో టీమిండియానే ఫేవరట్‌గా బరిలోకి దిగుతోంది.

Also Read: యువ కెరటం శుభ్ మన్ గిల్ చరిత్ర తిరగరాస్తాడా..

WATCH:

#pat-cummins #rohit-sharma #virat-kohli #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe