IND vs AFG: కోహ్లీకి ఒళ్లు మండేలా చేసిన కేఎల్‌ రాహుల్‌..! నవీన్‌ ఉల్‌ హక్‌ విషయంలో మరోసారి రచ్చ..!

ఈ ఏడాది ఐపీఎల్‌లో నవీన్‌ఉల్‌ హక్‌ వర్సెస్‌ కోహ్లీ మధ్య జరిగిన గొడవ ఎంత రచ్చ లేపిందో అందరికి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్ఘాన్‌, ఇండియా మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. నవీన్ ఉల్‌ హక్‌ని అవుట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కీపర్‌ కేఎల్‌ రాహుల్‌పై కోపం తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
IND vs AFG: కోహ్లీకి ఒళ్లు మండేలా చేసిన కేఎల్‌ రాహుల్‌..! నవీన్‌ ఉల్‌ హక్‌ విషయంలో మరోసారి రచ్చ..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అందరికి బాగా గుర్తున్న విషయాలు రెండే రెండు.. అందులో ఒకటి చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడం.. రెండోది విరాట్‌ కోహ్లీ-గంభీర్‌-నవీన్‌ ఉల్‌ హక్‌ ఎపిసోడ్‌. గ్రౌండ్‌లోనే తన్నుకుంటారా అని అనిపించేలా జరిగిందీ గొడవ. ఆ మ్యాచ్‌ తర్వాత నుంచి అఫ్ఘాన్‌ ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌(Naveen ul haq) కోహ్లీ(Kohli)కి పరోక్షంగా తన ఇన్‌స్టాలో కౌంటర్లు వేశాడు. ఇది కాస్త కోహ్లీ ఫ్యాన్స్‌కి మరింత కోపం తెప్పించింది. అప్పటినుంచి ఛాన్స్‌ దొరికినప్పుడల్లా నవీన్‌ని ఓ ఆట ఆడుకుంటున్నారు అభిమానులు. ఇక ఇండియా, అఫ్ఘాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఎదురుపడ్డారు. నవీన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నవీన్‌పై కాదు కానీ కేఎల్‌ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు కోహ్లీ.


అవుట్ చేయవా ఏంటి?
8 వికెట్లు పడిపోయిన తర్వాత 10వ నంబర్‌ బ్యాటర్‌గా నవీన్‌ ఉల్‌ హక్‌ బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆ టైమ్‌లో బుమ్రా బౌలింగ్‌ వేస్తు్న్నాడు. నవీన్‌ వచ్చిరాగానే ఫైన్‌లెగ్‌ వైపు బాల్‌ పంపించాడు. అక్కడ కోహ్లీ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. నిజానికి అక్కడ సింగిల్ తీసే ఛాన్స్ మాత్రమేఉంది. అయితే నవీన్‌ ఉల్‌ హక్‌ వేగంగా రన్‌ చేస్తూ రెండో పరుగుకు వెళ్లాడు. కోహ్లీ బాల్‌ని థ్రో చేశాడు. అక్కడ నవీన్‌ని అవుట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే కేఎల్‌ రాహుల్ లేజీగా వ్యవహరించాడు. బాల్‌ని కలెక్ట్ చేయలేదు. దీంతో కోహ్లీకి కోపం వచ్చింది. అవుట్ చేయవా ఏంటి అని అర్థం వచ్చేలా గట్టిగా అరిచాడు. రాహుల్‌ ఏం రిప్లై ఇవ్వలేదు. కోహ్లీ ఏదో తిట్టుకుంటూ కోపంగా తన ఫీల్డింగ్‌ పొజిషన్‌కి వెళ్లిపోయాడు.

ఐపీఎల్‌లో తీవ్ర రచ్చ లేపిన రోజు:
ఈ ఘటన జరిగిన వెంటనే అందరూ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లిపోయారు. ఐపీఎల్‌లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. లక్నో, బెంగళూరు మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో నవీన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పెద్ద గొడవే అయ్యింది. ముందుగా నవీన్‌ని సిరాజ్‌ కవ్వించాడు. నవీన్‌ మాటకు మాట చెప్పాడు. ఇంతలోనే కోహ్లీ వచ్చాడు. ఇద్దరూ ఏదో అనుకున్నారు. వెంటనే కోహ్లీ తన షూని చూపిస్తూ నవీన్‌ ఉల్‌ హక్‌ని తన బూటు కాలుతో పోల్చాడు. అక్కడితోఈ గొడవ ఆగలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకుంటున్న సమయంలోనూ మరోసారి నవీన్‌, కోహ్లీ మధ్య రచ్చ మొదలైంది. ఇక ఆ తర్వాత గంభీర్‌ ఇన్‌వాల్వ్ అవ్వడం.. కోహ్లీ-గౌతీ తిట్టుకోవడం.. దాదాపు కొట్టుకునేవరకు వెళ్లడం చకాచకా జరిగిపోయాయి. ఈ ఘటన మొత్తం ఐపీఎల్‌కే హైలెట్‌గా నిలిచిపోయింది.

ALSO READ: నీకు థ్యాంక్స్‌ సామీ.. గ్యాలరీల్లో అందాలను 30సెకండ్లలో చూపించేశావుగా.. వైరల్ వీడియో..!

Advertisment
తాజా కథనాలు