IND vs AFG: వరల్డ్‌కప్‌లో (World Cup 2023) భాగంగా ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లలో అఫ్ఘాన్ 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు తీశాడు.
అదరగొట్టిన కెప్టెన్:
టాస్ గెలిచి అప్ఘానిస్థాన్ (Afghanistan) కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు గుర్బాజ్, జాడ్రన్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. 28 బంతులు ఆడిన గుర్బాచ్ 21 రన్స్ చేశాడు. అటు జాడ్రన్ కూడా 28 బాల్స్ ఆడి 22 పరుగులు చేశాడు. వన్ డౌన్‌లో దిగిన రెహ్మత్ షా 22 బాల్స్‌లో 16 రన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా టీమిండియా బౌలర్ల జోరుకు బ్రేకులు వేశారు. ఇద్దరు పోటి పడి పరుగులు చేశారు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తర్వాత మరింత వేగంగా రన్స్ చేశారు. ముఖ్యంగా షాహిదీ సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. కానీ కుల్దీప్ బంతికి బోల్తా పడ్డాడు. 88 బాల్స్ ఆడిన షాహిదీ 80 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అటు అజ్మతుల్లా 69 బంతుల్లో 62 రన్స్ చేసి పాండ్యా చేతికి చిక్కాడు. పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆకట్టుకున్న టీమిండియా బౌలర్లు:
ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నబీ 27 బాల్స్‌లో 19 రన్స్ చేసి బుమ్రా (Bumrah) బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాత ఏ ఒక్కరూ రాణించకపోవడంతో అఫ్ఘాన్ 272 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక దశలో అఫ్ఘాన్ 300 రన్స్ చేసేలా కనిపించింది. కానీ షాహిదీతో టు అజ్మతుల్లా కీలక సమయంలో అవుట్ అవ్వడంతో అఫ్ఘాన్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఇక భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు పడగొట్టాడు. పాండ్యా రెండు వికెట్లు తీశాడు. శార్ధుల్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇటు హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్ మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 9 ఓవర్లు వేసిన సిరాజ్ (Siraj) ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.
ALSO READ: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..!