IND vs ENG: మ్యాచ్ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్ బ్రో? ఆదివారం జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో అశ్విన్‌ను ఆడించాలని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. By Trinath 26 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Ind vs Eng World Cup 2023: టీమిండియాలో ప్లేయంగ్-11 కాదు.. మొత్తం 15 మంది తోపు ఆటగాళ్లే. ఎవర్ని పక్కన పెట్టినా అయ్యో అనిపిస్తుంది. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు (World Cup 2023) భారత్ సెలెక్టర్లు ఎలాంటి వివాదాలను క్రియేట్ చేయకుండా పరఫెక్ట్ టీమ్‌ని సెలక్ట్ చేశారు. సూర్యకుమార్ సెలక్షన్‌లో కాస్త విమర్శలు వచ్చిన మాట నిజమే కానీ.. అతను భారత్ పిచ్‌లపై ఆడుతాడని సెలక్టర్లు సమర్థించుకున్నారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా తుది జట్టులో స్థానం తెచ్చుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్టార్ పేసర్ షమీని చూసి ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. మొదట నాలుగు మ్యాచ్‌లు షమి లేకుండానే భారత్ ఆడింది. బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ పేసర్లగా ఆడారు. ఠాకూర్‌కి బ్యాటింగ్ కూడా ఆడగలడన్న కారణంతో షమీ ప్లేస్‌లో అతడిని తీసుకున్నారు. అయితే గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై షమీ(Shami)ని తీసుకున్నారు. కాపు కాచుకోని కూర్చొన్న చిరుతలా చెలరేగాడు. 5 వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. కానీ తర్వాతి జరగబోయే మ్యాచ్‌కు షమీని జట్టులోకి తీసుకోవడం లేదని సమాచారం. షమి. అశ్విన్ అశ్విన్ వస్తున్నాడు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (India vs England) మ్యాచ్ ఈ నెల 29 న జరగనుంది. లక్నో వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు తుది జట్టు ఎంపిక రోహిత్ శర్మకు సవాలుగా మారింది. లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. దీంతో అశ్విన్(Ashwin)ని ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో అశ్విన్ ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచే ఆడాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఆడాడు.. తర్వాత నాలుగు మ్యాచ్‌లకూ అశ్విన్‌ని ఆడించలేదు. అయితే లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో అశ్విన్‌ని ఆడిస్తే ఇంగ్లండ్ బ్యాటర్లకు చెక్ పెట్టే అవకాశం ఉందని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. Mohammed Shami marks his @cricketworldcup comeback with a fiery five-wicket haul 🔥@mastercardindia Milestones 🏏#CWC23 | #INDvNZ pic.twitter.com/fk5xKym4ba — ICC (@ICC) October 22, 2023 పాపం షమి: ఇదే జరిగితే షమి స్థానంలో అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో సూర్యను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగిన షమి మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇది ఫ్యాన్స్‌ను కాస్త బాధ పెట్టేలా ఉంది. మరోవైపు టీమిండియా ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఐదు మ్యాచ్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిచి 10 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉంది. అటు ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్‌లో పసికూన అఫ్ఘాన్‌పై కూడా ఓడిపోయింది. ఇంగ్లండ్ ప్రస్తుతం లాస్ట్ నుంచి మూడో స్థానంలో ఉంది. 4 మ్యాచ్‌లు ఆడితే కేవలం ఒక్క మ్యాచే విన్ అయ్యింది. Also Read: పసికూనలపై ప్రతాపం.. ఒక్క మ్యాచ్ గెలుపుతో సెమీస్ రేస్‌లోకి ఆసీస్! #cricket #mohammed-shami #ind-vs-eng #ravichandran-ashwin #icc-world-cup-2023 #india-vs-newzealand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి