/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/england-jpg.webp)
ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఓటములే కానీ గెలుపు ఉండదు.. చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. మేం పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే వాళ్లతో వాదించడం అనవసరం. ఇంగ్లండ్ ఫ్యాన్స్‌తో వాదించినా ఇదే అనిపిస్తుంది. బచ్ బాల్ అంటూ.. ఎవరు ఏం అనుకున్నా మాకు అనవసరం అంటూ విర్రవీగారు. బజ్ బాల్‌తో సాధించిన రెండు, మూడు విజయాలతో విజయ గర్వం తలకెక్కింది. ఇంకేముంది. ఇదే అసలుసిసలైన గేమ్ స్ట్రాటజీ అని ఫిక్స్ ఐపోయారు. ఇదే ప్లాన్‌తో విజయాలు సాధించవచ్చని.. వరల్డ్‌కప్ కూడా గెలవచ్చని ఇంగ్లండ్ ఆటగాళ్లు బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తీరా వరల్డ్‌కప్‌లో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఏకంగా పసికూనల చేతిలో ఓడిపోయే స్థాయికి తీసుకొచ్చింది.
Massive wicket for Sri Lanka 💪
Lahiru Kumara gets his third wicket and it's Ben Stokes! pic.twitter.com/qRYKy7v3bJ
— Sky Sports Cricket (@SkyCricket) October 26, 2023
బజ్ బాల్ :
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఎన్నికైన తర్వాత ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ధాటిగా ఆడడం.. తొలి బంతి నుంచే వీరబాదుడు బాదడం ఈ స్టైల్ స్పెషాలిటీ. అగ్రెసీవ్‌గా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల కాన్ఫిడెన్స్‌పై దెబ్బకొట్టాలి. ఈ క్రమంలో వికెట్లు కోల్పోయిన పెద్దగా బాధ పడరు ఇంగ్లీష్ ప్లేయర్లు. అటు ఫీల్డింగ్ విషయంలోనూ ఈ కాన్సెప్ట్ డిఫెరెంట్‌గా ఉంటుంది. 10 పరుగులు సమర్పించుకొని అయినా ఒక వికెట్ తియ్యలన్నది ఈ బజ్ బాల్ కాన్సెప్ట్. ఈ తరహా ఆటకు అలవాటు పడిపోయిన ఇంగ్లండ్ ప్లేయర్లు అసలుసిసలైన క్రికెట్‌ను మర్చిపోయారన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితికి తగ్గట్లుగా ఎప్పుడైనా ఆటను మార్చుకోవాలని కానీ.. ఒక్కటే విధానాన్ని గిరిగీసుకొని కూర్చుంటే జట్టు పరిస్థితి చివరకు ఇలా తయారవుతుందంటున్నారు విశ్లేషకులు.
India hasn't been a happy hunting ground for one of the format's modern greats - Jos Buttler 😟#ENGvsSL #JosButtler pic.twitter.com/gA2yeA8gQF
— Cricbuzz (@cricbuzz) October 26, 2023
ఇక కష్టమే:
ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పసికూనల చేతిలోనూ ఓడిపోతూ ఇంటాబయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది ఇంగ్లీష్ జట్టు. అఫ్ఘానిస్థాన్, శ్రీలంకపై ఇంగ్లండ్ ఆట చెత్తగా ఉందంటున్నారు ఆ దేశ అభిమానులు. అసలు గెలవాలన్న పట్టుదల ఇంగ్లండ్ ప్లేయర్లలో అణువంతైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తొలిసారి ఇంగ్లండ్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయినా ఇంగ్లండ్ ఇటీవలి కాలంలో గొప్ప జట్టుగా పేరు తెచ్చుకుంది. అయినా కూడా వరల్డ్‌కప్‌లో ఘోర పరాజయాలను మూటగట్టుకోని సెమీస్ రేస్ నుంచి దాదాపు వైదొలిగింది.
Also Read: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!