World cup 2023: పాకిస్థాన్‌ లెజెండ్‌ అతి..! మాంసం తింటే మ్యాచ్‌లు గెలుస్తారా? మరి మీరేం గెలిచారు..?

టీమిండియా క్రికెటర్లు బలంగా మారడానికి మాంసం కారణమని పాక్‌ లెజెండ్ షాహీద్‌ అఫ్రిది చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. అఫ్రిది అభిప్రాయం సరైనది కాదని కొంతమంది చెబుతుండగా.. లేదు లేదు కరెక్ట్‌గానే చెప్పాడని మరికొందరు అంటున్నారు. అయితే శాఖాహారం అయినా మాంసాహారమైనా ఫిట్‌నెస్‌ కోసమేనని.. నాన్‌వెజ్‌ తినే క్రికెటర్లు కంటే వెజ్‌ తినే కోహ్లీ ఫిట్‌గా ఉంటాడని.. అఫ్రిది మాటలు తింగరిగా ఉన్నాయని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

World cup 2023: పాకిస్థాన్‌ లెజెండ్‌ అతి..! మాంసం తింటే మ్యాచ్‌లు గెలుస్తారా? మరి మీరేం గెలిచారు..?
New Update

నాన్‌ వెజ్‌లో ఉండే ప్రొటిన్‌ పుష్కలం. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది కాదనలేని నిజం. అయితే కేవలం నాన్‌వెజ్‌లోనే ప్రొటిన్‌ ఉంటుందనుకోవడం కరెక్ట్ కాదు. నాన్‌వెజ్‌తో సమానంగా.. కొన్ని ఆహారాలు అంతకంటే ఎక్కువగా ప్రొటిన్‌ని కలిగి ఉంటాయి. చాలా మంది క్రికెటర్ల డైట్‌లో నాన్‌వెజ్‌ ఉంటుంది. చికెన్, మటన్‌, ఫిష్‌ని ఎక్కువగా తినే క్రికెటర్లు ఉంటారు. అయితే కొంతమంది క్రికెటర్లు నాన్‌వెజ్‌ తినకుండా కేవలం వెజ్‌ మాత్రమే తింటారు. విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ప్యూర్‌ వెజ్‌ తింటున్నాడు. అయినా అతను ప్రపంచంలోనే ఫిట్‌నెస్‌ ఎక్కువన్న ప్లేయర్‌.. క్రికెట్‌లోనే కాదు ఇతర క్రీడల్లోనూ మనవాడిని మించిన ఫిట్టస్ట్ ప్లేయర్ లేడు. ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే వింత వ్యాఖ్యలకు, అర్థంపర్థం లేని మాటలకు కేరాఫ్‌గా నిలిచే పాక్‌ మాజీ క్రికెటర్లు మరోసారి తమ తింగరితనాన్ని బయటపెట్టుకున్నారు. పాక్‌ మాజీ కెప్టెన్‌, లెజండరీ ప్లేయర్‌ షాహిద్‌ అఫ్రిది(Shahid afridi) మరోసారి ట్రోల్‌కి గురయ్యాడు.

publive-image అఫ్రిది PC/static.toiimg

అఫ్రిది ఏం అన్నాడంటే?

భారత బౌలర్లు ఇప్పుడు మాంసం ఎక్కువగా తింటున్నారని.. అందుకే మరింత బలంగా మారారని కామెంట్ చేశారు అఫ్రిది. నిజానికి ఎవరి అభిప్రాయం వారిది. కానీ టీమిండియా సక్సెస్‌ని మాంసంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదన్నది భారత్ జట్టు అభిమానుల వాదన. అందుకు కోహ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో ప్రపంచంలోనే టాప్‌ బ్యాటర్‌ కోహ్లీ. వన్డే, టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ(Kohli)ని మించిన ప్లేయర్‌ లేడు. ఫిట్‌నెస్‌ పరంగానూ కోహ్లీ ప్రపంచంలోనే టాప్‌. అలాంటి కోహ్లీ వెజ్‌నే డైట్‌లో వాడుతాడని.. మరి ఈ లాజిక్‌ ఎలా కరెక్ట్ అవుతుందని కొందరు ఫ్యాన్స్‌ అఫ్రిదిని ప్రశ్నిస్తున్నారు. ఇది అసలు సరైన అభిప్రాయం కాదని చెబుతున్నారు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్‌ అవ్వడానికి అనేక ఫ్యాక్టర్స్‌ ఉన్నాయని.. ఇదంతా మాంసం వల్ల కానీ... ఏ ఒక్క అంశం వల్ల కానీ వచ్చిన మార్పు కాదంటున్నారు.



వెజ్‌ క్రికెటర్లు ఉన్నారు కదా:

శాఖాహార ఆహారాలు మీ ప్రోటీన్ అవసరాలను తీర్చగలవని డైటీషియన్లు ఇప్పటికీ చెబుతూ వస్తున్నారు. అయినా ప్రజల్లో మాత్రం మాంసం తింటేనే కండలు వస్తాయన్న అపోహ ఉంది. నిజానికి శాఖాహారం తీసుకునే టీమిండియా క్రికెటర్ల సంఖ్య కాస్త ఎక్కువే. సురేష్ రైనా, రోహిత్ శర్మ, మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, చెతేశ్వర్ పుజారా, హార్దిక్ పాండ్యా శాఖాహారులే. వీరంతా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు సాధించినవారు. రికార్డులు తిరగరాసిన వాళ్లు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు కూడా వీరే. అయితే శాఖాహారం అయినా మాంసాహారమైనా ప్రొటిన్‌తో పాటు ఫిట్‌నెస్‌ కోసమేనని గుర్తుంచుకోవాలని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. వెజ్‌ అయినా నాన్‌వెజ్‌ అయినా బాడీకి కావాల్సిన ప్రొటిన్‌ అందితే సరిపోతుంది. అంతే కానీ ఫుడ్‌ హ్యాబిట్స్‌తో విజయాలకు లింక్‌ పెట్టవద్దని సూచిస్తున్నారు.

ALSO READ: ‘నిన్ను మళ్లి గ్రౌండ్‌లో చూడను’.. 12ఏళ్ల క్రితం కోహ్లీని ఎగతాళి చేసిన క్రికెటర్.. తీరా చూస్తే సీన్‌ సితార్‌..!

#virat-kohli #shahid-afridi #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe