INDIA-BANGLADESH: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్‌ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమిని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేట్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇండియా ఓడిన వెంటనే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా ఫ్యాన్స్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
INDIA-BANGLADESH: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్‌ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!

బంగ్లాదేశ్‌(Bangladesh)కి స్వాతంత్ర్యం ఇచ్చింది ఇండియానే. 1971లో పాకిస్థాన్‌పై పోరాడి బంగ్లాకు కొత్త లైఫ్‌ని ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. నాటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) బంగ్లాదేశ్‌కు చేసిన సాయం అంతాఇంతా కాదు. ఈ విషయం బంగ్లాదేశ్‌కి తెలియనది కాదు. ఇప్పటికీ బంగ్లాదేశ్‌తో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌(Cricket fans) పరంగా మాత్రం బంగ్లాదేశ్‌ గుడ్‌ కాదు. స్టేడియంలోనే ప్రత్యర్థి జట్టు ఫ్యాన్స్‌పై గొడవలకు వెళ్లే నైజం బంగ్లా అభిమానులది. క్రికెటర్లను కూడా ఎగతాళి చేస్తుంటారు. అటు ప్లేయర్లు కూడా కొద్దీ కాలంగా చాలా బిల్డప్‌లు ఇస్తున్నారు. ఓ రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జట్టని అందరు పొగుడుతుండే సరికి గర్వం తలకెక్కుతోంది. వికెట్లను తన్నడం.. అంపైర్లపై చిందులు వేయడంతో పాటు నాగిని ప్లేయర్లు నాగిని డ్యాన్స్‌ ఘటనలను క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎప్పటికీ మరిచిపోలేరు. ప్లేయర్లను చూసి ఫ్యాన్స్‌ తయారవుతున్నారో... ఫ్యాన్స్‌ చూసి ప్లేయర్లు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ.. తాజాగా బంగ్లా క్రికెట్‌ ఫ్యాన్స్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


ఇండియా ఓడిపోతే ఎగురుతారా?
నవంబర్ 19న జరిగిన వన్డే వరల్డ్‌కప్‌(World Cup) ఫైనల్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో ఇండియా(India) ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి సగటు భారత్‌ క్రీడా అభిమానిని బాధించింది. మిగిలిన దేశాల క్రికెట్ అభిమానులు కూడా బాధ పడాలని రూల్ లేదు. ఆస్ట్రేలియాకు కూడా క్రికెట్‌లో ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువే ఉంటుంది. అలా ఆస్ట్రేలియాను ఇష్టపడితే తప్పు లేదు కానీ.. ఇండియాపై కారణం లేకుండా ద్వేషం పెంచుకోని ఆస్ట్రేలియా విజయాన్ని సెలబ్రెట్ చేసుకోవడం విడ్డూరంగా అనిపిస్తోంది. బంగ్లాదేశ్‌ క్రికెట్ ఫ్యాన్స్‌ చేసిందిదే. ఇండియా ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకున్నారు.


ఎందుకిలా చేస్తున్నారు?
ఫ్యాన్స్ అంతా ఇలానే ఉంటారని లేదు కానీ.. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్‌లోని పెద్ద స్క్రీన్ల వద్ద ఆ దేశ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినట్లు సమాచారం. అసలు బంగ్లాదేశ్‌ను శత్రుదేశంగా టీమిండియా క్రికెట్‌ అభిమానులు ఎప్పుడూ భావించలేదు. భారతీయులు సాధారణంగా పాకిస్థాన్‌ పట్ల వ్యతిరేకంగా ఉంటారు. సరిహద్దు గొడవలు, కశ్మీర్‌ ఇష్యూ దీని వెనుక కారణం కావొచ్చు. ఇటు బంగ్లాదేశ్‌ విషయంలోనూ భారత్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నా క్రికెట్ ఫ్యాన్స్‌ మాత్రం ఆ జట్టుకు వ్యతిరేకంగా మాట్లాడరు. చెప్పాలంటే పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఇండియా ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. బంగ్లాదేశ్‌లో భారతదేశ వ్యతిరేక, పాకిస్తాన్ అనుకూల అంశాలు ఎల్లప్పుడూ ఉంటున్నాయని పలువురు జర్నలిస్టులు వివరిస్తున్నారు. పామును పెంచితే చివరకు కాటేస్తుందన్న విషయాన్ని భారత్‌ గుర్తుపెట్టుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: ట్రోఫీపై కాళ్లు.. షమీ స్ట్రాంగ్‌ రియాక్షన్‌.. ఏమన్నాడంటే..!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు