SHAMI: ట్రోఫీపై కాళ్లు.. షమీ స్ట్రాంగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే..! తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధాకరమన్నారు టీమిండియా స్టార్ పేసర్ షమీ. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ తీరు బాధ కలిగించిందన్నాడు. ఇక బెంచ్‌లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలని.. పిచ్‌ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై నమ్మకం లేదని చెప్పాడు. By Trinath 24 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి వరల్డ్ కప్(World cup) ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) కాళ్లు పెట్టడంపై ఇప్పటికీ తీవ్ర దుమారం రేగుతూనే ఉంది. ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. మార్ష్ ప్రవర్తనను క్రికెటర్స్ కూడా తప్పుబడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఆటగాళ్లంతా ఆ ట్రోఫీ కోసం ఎంతో పోరాడుతారని.. తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధ కలిగించిందన్నారు. మానసికంగా ధృడంగా ఉండాలి: వరల్డ్ కప్ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉండి పలు రికార్డులు సృష్టించిన షమీ..మొదటి నాలుగు మ్యాచులకు దూరమవడంపైనా స్పందించారు. బెంచ్‌లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలన్నాడు షమీ. ఆటగాళ్లు పలుమార్లు ఒత్తిడికి లోనవుతుంటారని..కానీ జట్టు మంచి ఫెర్మార్మ్ చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుందన్నాడు. ఇక క్రికెట్ పిచ్‌ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై తనకు అంత నమ్మకం లేదన్నారు. బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే పిచ్ స్వభావం అర్థమవుతుందన్న షమీ..ప్రశాంతంగా ఉంటే మెరుగ్గా రాణిస్తామన్నాడు. మార్ష్‌పై కేసు: ఇక ఇదిలా ఉంటే మిచెల్ మార్ష్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యూపీలోని అలీఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి ..ఢిల్లీ గేట్ పీఎస్‌లో చేసిన ఫిర్యాదుతో మార్ష్‌పై కేసు నమోదైంది. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి..మార్ష్ భారతీయుల మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. వరల్డ్‌కప్ మీద కాళ్లు ఉంచడం ద్వారా ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించటంతో పాటుగా 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా అవమానించారని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ భారత్‍లో ఆడకుండా, అలాగే టీమిండియాపై కూడా ఎక్కడా ఆడుకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కంప్లైంట్ కాపీని ప్రధాని మోదీ, క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ కార్యాలయాలకు సైతం పంపించారు. ఇక ప్రపంచకప్ ఆడిన మిచెల్ మార్ష్..భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు మాత్రం దూరమయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ సహా మరికొందరు క్రికెటర్లు ప్రపంచకప్ ముగియగానే స్వదేశం చేరుకున్నారు. స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, స్టయినిస్, మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్లు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతున్నారు. Also Read: టీమిండియాకు మరో ధోనీ దొరికేశాడు.. కొత్త ఫినీషర్ వచ్చేశాడోచ్..! WATCH: #cricket #icc-world-cup-2023 #mitchell-marsh #mohammed-shami #india-vs-australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి