IBPS Clerk Admit Card: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) క్లర్క్ పోస్టులకు ఉండే పోటి చాలా ఎక్కువ. మరికొద్ది రోజుల్లో ఐబీపీఎస్ ప్రిలిమ్స్‌కు పరీక్ష జరగనుండగా.. ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్లు అడ్మిట్ కార్డ్(Admit card) కోసం వెయిట్ చేస్తున్నారు. 4,000 కంటే ఎక్కువ ఖాళీల కోసం ఐబీపీఎస్ గతంలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. IBPS పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ పరీక్ష ఆగస్టు 26, 27 తేదీల్లో, రెండో దశ అక్టోబర్ 2న నిర్వహించనున్నారు. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఏ సమయంలోనైనా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత, అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి దశలు:
స్టెప్ 1 - ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in ని విజిట్ చేయండి.
స్టెప్ 2 - ఇక్కడ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3 - వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.
స్టెప్ 4 - అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 5 - అడ్మిట్ కార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేయండి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్ల ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 4,545 ఖాళీలను భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఈ ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష జరుగనుండగా ఫలితాలు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ టెస్ట్ అక్టోబర్‌లో జరగనుంది. పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 28న ముగిసింది. రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌లోని IBPS క్లర్క్ ఖాళీలకు కనీస వయసు 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా.
Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!