Kuwait Fire Accident: కువైట్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌కు చేరుకున్న మృతదేహాలు

కువైట్‌లోని మంగాఫ్‌లో ఓ భవనంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదంలో 49 మంది మృతిచెందగా అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. శుక్రవారం ఉదయం వారి మృతదేహాలను కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చారు.

New Update
Kuwait Fire Accident: కువైట్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌కు చేరుకున్న మృతదేహాలు

Kuwait Fire Accident: కువైట్‌లోని మంగాఫ్‌లో ఓ భవనంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మృతిచెందారు. అందులో 45 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ మృతదేహాలను కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానశ్రయానికి (Kochi Airport) తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అలాగే సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేష్‌ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్‌తో సహా పలువురు అక్కడికి వచ్చారు.

Also read: వారి ఆత్మహత్యలకు నీట్ తో సంబంధం లేదు.. సుప్రీం కోర్టు!

అయితే మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత వాయుసేనకు సంబంధించి ఓ విమానం గురువారం రాత్రి కువైట్‌కు చేరుకుంది. అనంతరం మృతదేహాలను తీసుకొని శుక్రవారం ఉదయం కేరళలో ల్యాండ్‌ అయ్యింది. మృతుల్లో 23 మంది కేరళవాసులు ఉన్నారు. అలాగే ఏడుగురు తమిళనాడుకు చెందినవారు, ఏపీకి చెందినవారు ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఒక్కరు ఉన్నారు. ఇక మిగిలినవారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. కొచ్చిలో ల్యాండ్ అయిన తర్వాత ఆ విమానం ఢిల్లీకి బయలుదేరింది.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే

Advertisment
తాజా కథనాలు