నేను చచ్చేంత వరకు సీఎం జగన్ (Jagan) వెంటే ఉంటానని..పార్టీ మారేదే లేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) . ప్రస్తుతం అంబటి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు (Chandrababu) మహిళలకు రుణమాఫీ అంటూ నట్టేట్లో ముంచేశాడు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులు ఎత్తేశాడు. జగన్ ఆనాడు మాట ఇచ్చాడు..ఇప్పుడు చేస్తున్నాడు..ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేరుస్తున్నాడు అంటూ పేర్కొన్నారు.
అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజల్లోకి తలెత్తుకుని వెళ్తున్నాం అంటూ వివరించారు. పేదల కోసం నిరంతరం కష్టపడుతున్న జగన్ అని కొనియాడారు. ఏ రాష్ట్రంలో కూడా అమ్మ ఒడి పథకం లేదు. కానీ ఏపీలో ఉంది. దాని వల్లే పిల్లలు బాగా చదువుకుంటున్నారు. రైతు భరోసా, సచివాలయం ద్వారా ఎన్నో పనులు గ్రామాల్లోనే జరుగుతున్నాయి.
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజలు మరలా రాష్ట్రానికి సీఎం కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని అంబటి తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఆయన విమర్శలు చేశారు. కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే చూసుకునే నాయకులు వారిద్దరూ. అందుకే ప్రజలు వారిని కాదు అనుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 151 సీట్లతో జగన్ కి ఏపీ ప్రజలంతా అండగా నిలిచారు. టీడీపీకి 23 సీట్లుచ్చి ఇంటికి పంపారు. బాబు జైలుకి వెళ్లిన నాడు పవన్ కల్యాణ్ తప్ప మరెవరు కూడా జైలుకి వెళ్లలేదు. బాబు చేసిన అవినీతిలో ఆయనకు కూడా వాటా ఉందా అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ వాళ్లు మా వాడు కడిగిన ముత్యంలా వస్తాడు అని చెప్పుకున్నారు..కానీ కంటి ఆపరేషన్ కోసం బయటకు వచ్చాడు అంటూ అంబటి సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకుని చిత్త శుద్దితో పాలన చేసిన నాయకుడు జగన్ అంటూ కొనియాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ అడిగినట్లు ప్రజలను ధైర్యంగా అడగలేదు. మీకు మా ప్రభుత్వంలో మేలు జరిగితేనే ఓటు వేయండి అని ఎంతో ధైర్యంగా చెబుతున్నారు.
గతంలో చంద్రబాబు బడులను పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. జగన్ పాఠశాలల రూపు రేఖలే మార్చేశారు. కాపులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. వంగవీటిని హత్య చేసిన వ్యక్తి చంద్రబాబు.ముద్రగడను జైలులో పెట్టించిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు.
30 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత జగన్ ది అని అన్నారు. పేదల కోసం పని చేసే ప్రభుత్వం వైసీపీ అంటూ తెలిపారు. 2024లో పేదలకు పెత్తం దారుల మధ్య జరిగే ఎన్నిక ఇది.పవన్ ఎంత చంద్రబాబును పైకి లేపాలి అని చూసినా సరే మళ్లీ గెలిచేది జగనే అంటూ ఆయన అన్నారు. 175కి 175 సీట్లు ఇచ్చి జగన్ ని మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంబటి తెలిపారు.
Also read: రన్ వే పై వీధి కుక్క..ల్యాండ్ అవ్వకుండా వెనుదిరిగిన విమానం!