Bangladesh : త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తున్నా.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షేక్‌ హసీనా చెప్పినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.

Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
New Update

Sheikh Hasina Says I Will Return Soon To Bangladesh : రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ (Bangladesh) లో చెలరేగిన నిరసనలు హింసాత్మక ఘటనలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌ (India) లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే తాను బంగ్లాదేశ్‌కు తిరిగివస్తానని చెప్పినట్లు ఓ వార్తా కథనం ప్రచురితమైంది. అంతేకాదు తన రాజీనామాకు ముందు బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేశారు.

' బంగ్లాదేశ్‌లో చాలామంది నాయకుల్ని చంపడం, పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం, వారి ఇళ్లను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు వార్తల్లో చూసినప్పుడు నా హృదయం రోదిస్తోంది. త్వరలోనే నేను మళ్లీ తిరిగి వస్తాను. అవామీ లీగ్ పార్టీ మళ్లీ, మళ్లీ నిలబడుతుంది, పోరాడుతుంది. బంగ్లాదేశ్‌ ప్రజల భవిష్యత్తు కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తూనే ఉంటాను. ఈ దేశం కోసం మా నాన్న ఎంతో కృషి చేశారు. నా తండ్రి, కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది. మృతదేహాల ఊరేగింపులు చూడకడదనే ఉద్దేశంతోనే నేను నా పదవికి రాజీనామా చేశాను. విపక్ష నేతలు విద్యార్థుల మృతదేహాలపై అధికారంలోకి రావాలని చూస్తున్నారు. నేను దీనికి అనుమతించను. సెయింట్ మార్టిన్ ఐలాండ్‌ సార్వభౌమాధికారనికి లొంగిపోయి, బే ఆఫ్‌ బెంగాల్‌పై అమెరికా పట్టు సాధించేందుకు అనుమతిస్తే నేను అధికారంలో ఉండగలిగేదాన్ని. నా దేశ ప్రజలను నేను వేడుకుంటున్నాను. రాడికల్స్‌ మాటలు నమ్మి మోసపోకండని' ఆమె ఓ వార్తా సంస్థకు వివరించింది.

Also Read: నిర్మాణంలో కైగా పవర్‌ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?

ఇదిలాఉండగా ఆగస్టు 5న షేక్‌ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి యూకేకు వెళ్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆమె ప్రస్తుతం భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే షేక్ హసీనా తన సందేశంలో సెయింట్‌ మార్టీన్ ఐలాండ్ గురించి చెప్పారు. ఇది బే ఆఫ్‌ బెంగాల్‌లోని 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టెక్నాఫ్ ద్వీపకల్పంలోని కాక్స్ బజార్‌కు దక్షిణాన 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. బంగ్లాదేశ్‌ దక్షిణ ప్రాంతం వైపు ఈ ఐలాండ్‌ ఉంటుంది.

ఇదిలా ఉండగా షేక్ హసీనా తన సందేశంలో మరికొన్ని కీలక విషయాలు కూడా వివరించింది. ' బంగ్లాదేశ్‌ విద్యార్థులకు నేను మళ్లీ చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని రజాకార్లని ఎప్పుడూ పిలవలేదు. మిమ్మల్ని ప్రేరేపించేందుకు నా మాటల్ని వక్రీకరించారు. ఆ రోజు జరిగిన ఫుల్‌ వీడియోను మీరు చూడాలని కోరుతున్నాను. కుట్రదారులు దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకొని దేశంలో అల్లర్లు సృష్టించారు. విదేశీ ఇంటిలిజెన్స్‌ సంస్థకు చెందిన ఒక చిన్న గ్రూప్‌ ఈ అల్లర్లను సృష్టించిందని నేను భావిస్తున్నాను. దీనివెనుక ఐఎస్‌ఐ (ISI) ఉందని గట్టిగా నమ్ముతున్నాను. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం రిజర్వేషన్‌ కోటాను తప్పనిసరి చేయలేదు. వీటిని పునరుద్దరిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి కారణమే లేదు. 2018లోనే మా ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసిందని' షేక్ హసీనా వివరించింది.

#bangladesh #india #sheikh-hasina
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe