MP Lavu Sri Krishna Devarayulu:ఆంధ్రా రాజకీయాలు మంచి రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్న మార్పులు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇందులో తాజాగా పలువురు ఎంపీల స్థానాలను కూడా మార్చారు. మిగతావి ఎలా ఉన్నా ఈ స్థానాల మార్పులో నరసరావుపేట ఎంపీ సీటు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా విజ్ఞాన్ స్కూల్స్ అధిపతి లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
అయితే ఇతనని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ ఆదేశించింది. నరసరావుపేట సీటు బిసీలకే ఇవ్వాలని వైసీపీ, టీడీపీలు డిసైడ్ అవ్వడమే ఇందుకు కారణం. దీంతో నిన్న శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ క్యాలయానికి పిలిచి కూడా మాట్లాడారు. అయితే ఎవరెన్ని చెప్పినా తాను గుంటూరు కు వెళ్లలేనని తెల్చి చెప్పేశారు లావు కృష్ణదేవరాయులు. నరసరావుపేట తప్ప వేరే ఎక్కడా పోటీ చేయలేనని అధిష్టానికి స్పష్టం చేశారుట.
బీసీలకే నర్సరావుపేట..
నరసరావుపేట సీటు బిసీలకే ఇవ్వాలని వైసీపీ, టీడీపీలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బిసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని లేదా యాదవ కమ్యూనిటీ కి చెందిన అభ్యర్థిని పెట్టె ఆలోచనలో ఉంది వైసీపీ అధిష్టానం. మరోవైపు టీడీపి కూడా నరసరావుపేట ఎంపీ టికెట్ బిసీ కి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ టీటీడీ చైర్మన్ పుత్తా సుధాకర్ యాదవ్ ను దింపే అలోచన చేస్తోందని నమాచారం.
అంబటి రాయుడు అందుకే రాజీనామా చేశాడా?
ఇక ఈరోజు క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడానికి కూడా కారణం శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు రమ్మనడమే కారణం అని అంటున్నారు. గుంటూరు ఎంపీ టికెట్‌ను (Guntur MP Ticket) అంబటి రాయుడుకి ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అయితే తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా నిన్న జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్ధికి కేటాయించాలని అనుకుంటున్నామని తెలిపారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు రానని చెప్పేశారు. అంబటి రాయుడు ఇప్పుడు పార్టీలో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇదే అయ్యుంటుందా అని పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి.