Pawan Kalyan at Pithapuram: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. వై ప్లస్ సెక్యూరిటీలో నలుగురు గన్‌మెన్లు, ఓ ఎస్పీ స్థాయి ఆఫీసర్‌ను నియమించింది. అలాగే ఒక డీఐజీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, రోప్ టీం కింద 10 మందిని ఏర్పాటుచేసింది.
Also Read: మెడికల్ కాలేజీలో విషాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకిన డాక్టర్!
ప్రైవేట్ సెక్యూరిటీ కింద వారాహి టీం, రిటైర్డ్ ఆర్మీకి సంబంధించి 39 మందిని నియమించింది. ఇక పవన్ పిఠాపురంలో అడుగుపెట్టడంతో పెద్ద ఎత్తున జనం ఆయనకు స్వాగతం పలికారు. పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని పవన్ ప్రకటించారు. ఇక ఎన్నికలకు ముందు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఓ ఇంటిని పార్టీ కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: అందుకే జీతం తీసుకోలేదు: పవన్ కళ్యాణ్