Mohammad Shami:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ మహ్మద్ షమీ..ట్రెండింగ్‌లో ఉన్న క్రికెటర్. వరల్డ్‌కప్‌లో శ్రీలంక మ్యాచ్ తరువాత ఇతని పేరు వరల్డ్‌వైడ్‌గా మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఇతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి షమీ ట్రెండింగ్ అవుతున్నాడు. అర్జున అవార్డు అందుకుంటున్న వీడియో,అతని పోస్ట్ వైరల్ అవుతున్నాయి. By Manogna alamuru 10 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MOHAMMAD SHAMI:ప్రస్తుతం భారత్ నుంచి అత్యద్భుతమైన బౌలర్లు ఎవరంటే...మహ్మద్ షమీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. వరల్డ్ కప్‌లో కమ్ బ్యాక్ ఇచ్చిన షమీ అప్పటినుంచి బౌలింగ్ అదరగొడుతూ ప్రత్యర్దులను బెంబేలెత్తిస్తున్నాడు. హార్దిక్ పాండ్య గాయంతో ప్రపంచకప్ కు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన షమీ ఫైఫర్లతో అదరగొట్టాడు. ఫైఫర్లు(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) తియ్యడం ఇంత ఈజీనా అన్నట్లు సాగింది షమీ ప్రదర్శన. సెమీస్‌లో ఏకంగా 7వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బౌలింగ్ పిచ్‌లపై షమీ రాణించిన తీరు అందరిని కట్టిపడేసింది. దీంతో భారత ప్రభుత్వం షమీకి అర్జున అవార్డును ఇచ్చింది. Also Read:రేపటి నుంచి పెట్రోల్ బంద్ అని ప్రచారం.. బంకుల ముందు భారీ క్యూలు అర్జున అవార్డు గ్రహీత... నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ దేశ అత్యున్నత రెండో క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డును అందుకున్నాడు. దీని మీద షమీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. నాకష్టానికి ప్రతిఫలం లభించింది అని రాశాడు. భారతదేవం గర్వించేలా ఎల్లప్పుడూ శ్రమిస్తా అని చెప్పుకొచ్చాడు. తన ప్రయాణంలో తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో పాటూ భారత క్రికెటర్లు అందరూ షమీకి కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇవన్నీ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. Today I am feeling very proud that I have been honored with the prestigious Arjuna Award by the President. I want to thank all those people who have helped me a lot to reach here and have always supported me in my ups and downs... thanks to My Coach, BCCI,team mates,my family,… pic.twitter.com/fWLGKfY5g8 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 9, 2024 Thank you so much ❤️❤️ https://t.co/ZnEteBD6Zs — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 9, 2024 Thanks Ravi bhai ❤️❤️🙏🏻🙏🏻🙏🏻 https://t.co/gUKRE2rm0p — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 9, 2024 వరల్డ్‌కప్‌లో రికార్డుల మోత.. అక్టోబర్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో షమీ రికార్డుల మోత మోగించాడు. సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ. ఈ ఒక్క వరల్డ్‌కప్‌లోనే షమీ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు వరల్డ్‌కప్‌ల్లో వేగంగా 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా షమీ సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్లు కూల్చాడు . ఐసీసీ ఈవెంట్లలో ఇదే అత్యుత్తుమం. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమీ బౌలింగ్ యావరేజ్ 9.56. అంటే సుమారు ప్రతి 10 బంతులకు ఒక వికెట్ తీశాడు. ఇక ప్రపంచకప్ హిస్టరీలో నాలుగు సార్లు ప్లేయర్ ఆప్ ది అవార్డు అందుకున్న బౌలర్ షమీ.. అందులో మూడు సార్లు ఈ వరల్డ్‌కప్‌లోనే ఉన్నాయంటే షమీ ఫామ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఇక వన్డే హిస్టరీలో ఇప్పటివరకు 9సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న షమీ.. ఇందులో 5సార్లు న్యూజిలాండ్‌పైనే వికెట్లు పడగొట్టాడు. కష్టాలతో ఎదురీత... అయితే షమీ జీవితం ఏమీ అంత సాపీగా సాగిపోలేదు. కష్టాల్లోంచి ఒక్కో మెట్టు ఎక్కి పైకి ఎదుగుకుంటూ వచ్చాడు. ఇతని జీవితం ఒక లైఫ్ లెసన్ అవుతుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న షమీ...దాన్ని పక్కన పెట్టి ఎదిగాడు. క్రికెట్ కెరీర్‌లో కష్టాలు, కుటుంబంలో కలహాలు.. కుటుంబమంతా ఒకవైపు షమీ ఒక్కడే ఇంకోవైపు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ షమీకి కాంట్రాక్ట్ కూడా ఆపేసింది. టీమ్ నుంచి పక్కనపెట్టింది. అంతకముందు కూడా ఫామ్‌లేక దాదాపు ఏడాదిన్నర కాలం షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇలా వ్యక్తిగతంగాను, కెరీర్‌పరంగానూ ఎన్నో బాధలు పడ్డ షమీకి మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందిట. ఈ విషయాన్ని షమీనే గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడా రోజులు లేవు.. ప్రపంచకప్‌లో షమీ రారాజు.. షమీని పక్కన పెట్టే సాహసం టీమిండియా మరోసారి చేయకపోవచ్చు. షమీ లేని పేస్ దళాన్ని సగటు భారత్ క్రికెట్ అభిమాని ఇప్పుడు ఊహించుకోలేడు. దటీజ్ షమీ..! #social-media #cricket #india #president #mohammad-shami #arjun-award మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి