CM KCR: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్. మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తనను బెదిరించినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టలేదని 25 వేల కోట్ల రూపాయలను తెలంగాణకు రాకుండా అపారని ఆరోపించారు.

New Update
CM KCR: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TS Elections 2023: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR) ఈరోజు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రధాని మోదీపై (PM Modi) విమర్శలు చేశారు. తాను కూడా ఒక రైతునేనని.. రైతుల బాదేందో బతుకేందో తనకు బాగా తెలుసు అని అన్నారు. రైతుల బాయిల కాడ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తనను బెదిరించారని సంచలన ఆరోపణలు చేశారు. తాను చచ్చిన సరే గాని రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టాను అని మోదీకి చెప్పినట్లు తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోతే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ లో రూ.5,000 కోట్లను కట్ చేస్తామని మోదీ హెచ్చరించినట్లు తెలిపారు.

ALSO READ: కాంగ్రెస్ కు కర్ణాటక నుంచి పైసలు.. నకిరేకల్ లో కేటీఆర్ సంచలన ఆరోపణలు!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లకు పెట్టకపోతే బడ్జెట్ లో తెలంగాణకు వచ్చే రూ.25000 కోట్లను ప్రధాని మోదీ ఆపినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ ఎన్ని చేసినా తాను మాత్రం మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలిపారు. వ్యయసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదని అన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు ఏ ముఖంతో తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెట్టిందని.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. భారత దేశంలో తెలంగాణ ఒక భాగం కాదా? అని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ALSO READ: కాంగ్రెస్ ఓడిపోతే నిరుద్యోగులు అడవి బాట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాకు ఒకటి పెట్టాలనే చట్టం ఉందని.. ప్రధాని మోదీ దాన్ని ఉల్లంఘించారని అన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి?, ఏ కారణంతోని వెయ్యాలి? అని సీఎం కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు