Axar Patel: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్

సహచర ఆటగాడు రిషభ్‌ పంత్ రోడ్డు యాక్సిడెంట్ వార్త తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని అక్షర్ పటేల్ చెప్పారు. నా సోదరి విషయం చెప్పగానే షాక్‌ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించి కాళ్లు, చేతులు ఆడలేదంటూ ఎమోషనల్ అయ్యాడు.

New Update
Axar Patel: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్

Axar Patel: భారత స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్ రోడ్డు యాక్సిడెంట్ వార్త (Rishabh Pant Accident News) తనను భయాందోళనకు గురిచేసిందని యంగ్ ప్లేయ్ అక్షర్ పటేల్  చెప్పారు. ఆ ఊహించని ఘోరంతో ఒక్కసారిగా తనలో భయం అవరించిందని, పంత్‌కు ఏదో జరిగిపోయిందనే ఆందోళనతో కాళ్లు, చేతులు ఆడలేదన్నాడు. అయితే అక్షర్ సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట చేయగా వైరల్ అవుతోంది.

ఈ మేరకు అక్షర్ (Axar Patel) మాట్లాడుతూ.. ‘ఆ రోజు ఉదయం 7 గంటలకు మా సోదరి నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. పంత్‌తో నువ్వు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు? అని అడిగింది. ముందు రోజే మాట్లాడాలని అనుకున్నాను.. కానీ కుదరలేదని చెప్పాను. వెంటనే పంత్‌ అమ్మగారి ఫోన్‌ నంబర్‌ కావాలని, నన్ను పంపించమని కోరింది. ఎందుకు అని అడిగితే.. పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపింది. ఆ మాట వినగానే నేను షాక్‌ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించి కాళ్లు, చేతులు ఆడలేదు’ అంటూ అక్షర్‌ పటేల్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Rohith : పిచ్ గురించి తెలిస్తేనే మాట్లాడండి.. టెస్ట్ ఓటమి విమర్శలపై రోహిత్ ఫైర్

ఇదిలావుంటే.. రిషబ్ పంత్‌ మోకాలికి ఇటీవలే శస్త్రచికిత్స చేశారు వైద్యులు. దీంతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికప్పుడూ తన అభిమానులకు హెల్త్ అప్ డేట్ ఇస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ షేర్‌ చేసిన వీడియోపై ఢిల్లీ మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ, కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా పంత్‌ ఆరోగ్యపరిస్థితిపై స్పందించడం విశేషం. కాగా ఐపీఎల్‌ (IPL) వేలం సందర్భంగా రిషభ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తరఫున దుబాయ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు