/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-11-2-jpg.webp)
Odisha : పన్ను ఎగవేతల ఆరోపణల నేపథ్యంలో గత మూడు రోజులుగా ఒడిశా(Odisha) కు చెందిన లిక్కర్ డిస్టెల్లరీ గ్రూప్‌కి చెందిన సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (శనివారం) కూడా ఐటీ అధికారులు తమ సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపుతోంది. దేశంలో జరిగిన ఓకే సోదాల్లో ఇంతపెద్ద మొత్తంలో బ్లాక్ మనీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం రోజున ఒడిశా, ఝూర్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో లిక్కర్ డిస్టెల్లరీ గ్రూప్ అలాగే దానికి సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కంపెనీకి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీకీ చెందిన ధీరజ్ సాహుతో సంబంధం ఉన్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.
Also read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇదిలా ఉండగా.. శుక్రవారం నాటికి 220 కోట్లు నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ.. ప్రజల నుంచి దోచుకున్న ప్రతిరూపాయిని కక్కిస్తామని వ్యాఖ్యానించారు. దీంతో ఈ సోదాలను మరింత ఉద్ధృతం చేసిన అధికారులు శనివారం మరిన్ని నోట్ల కట్టలతో నిండిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు (శనివారం) ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలోని సుధాపురా ప్రాంతంలో మరో ఇరవై డబ్బులతో నిండిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులను అధికారుల ఇంకా లెక్కిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డబ్బులు దాదాపు రూ.300 కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి రూ.200 కోట్లకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అద్దం పడుతోందని అంటున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ కార్యకర్తలు ధీరజ్ సాహు దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టి నిరసనలు చేశారు. అలాగే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కూడా కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు.
Income Tax raids expose Congress leader Dheeraj Sahu's Rs 200 crore treasure trove. Another
chapter in the book of Congress corruption!#CorruptionKiDukan pic.twitter.com/gsbnFTc4me— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 9, 2023
#UttarPradesh: #BJP workers hold protest against Congress MP #DhirajPrasadSahu over recovery of Unaccounted money worth about Rs 200 Crore in #IncomeTaxRaid in #Bareilly.#cliQIndia pic.twitter.com/3SyB7RXgeq
— cliQ India (@cliQIndiaMedia) December 9, 2023
C for Congress, C for Corrupt
Cong betrayed and scammed the nation with their corrupt mindset. The recent recovery of over Rs 200 crore in cash from Congress MP Dheeraj Sahu is the actual picture of Congress-ruled states.#CorruptionKiDukan pic.twitter.com/8qzgRV0fGQ
— Pijush Hazarika (@Pijush_hazarika) December 9, 2023