Bollywood: బాలీవుడ్ నటి ముంతాజ్(Munthaj) తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు (Telugu) ఇలా అన్ని భాష ల్లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె ఖుషి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో ఐటెం సాంగ్ చేయడంతో ఒక్కసారిగా తన పాపులారిటీ పెరిగింది.
కానీ అలా చేయడంతో ఆమెకు శృంగార తారగా ముద్ర వచ్చేసింది. అయితే ముంతాజ్ ఏవో కారణాల వల్ల గత కొంత కాలంగా నటనకు దూరమైంది. అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది.తాజాగా, ముంతాజ్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తలుచుకొని ఎమోషనల్ కామెంట్లు చేసింది.
‘‘ఒకరోజు నాకు ఉన్నట్టుండి విపరీతమైన నడుము నొప్పి వచ్చింది. ఎటు కదల్లేకపోయాను. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఆ నొప్పి మాత్రం తగ్గలేదు. రెండేళ్ల పాటు ఆ నొప్పిని అలాగే భరించాను. ఆ తర్వాత నాకు ఆటో ఇమ్యూన్ అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎన్నో రోజులు నొప్పులతో విలవిల్లాడి పోయేదాన్ని. కీళ్ల జాయింట్ వద్ద సమస్య వల్ల కూర్చోలేకపోయేదాన్ని. సరిగా నిలబడలేక పోయేదాన్ని. శరీరాన్ని కదిలించడమే కష్టమయ్యేది. అలాంటి సమయంలో నేను డిప్రషన్ కు లోనయ్యా.. నొప్పి తట్టుకోలేక రోజంతా ఏడ్చేదాన్ని.. నా కుటుంబం నాకు అండగా లేదు.. కానీ మా అన్నయ్య సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఈరోజు ఉన్నాను. ఆ సమయంలో నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు 40 సంవత్సరాలు దాటాయి. ఇక నాకు పెళ్లి అవుతుందో లేదో అని అనిపిస్తుందని నటి చెప్పుకొచ్చింది.
Also read: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు… ప్రజలు బయటకు రావొద్దు!