మహిళా బిల్లుకు మేము పూర్తి మద్దుతునిస్తున్నాం-సోనియా గాంధీ

పార్లమెంటు సమావేశాల్లో మూడవ రోజు చర్చ ప్రారంభం అయింది. మహిళా బిల్లుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రకటించారు.

మహిళా బిల్లుకు మేము పూర్తి మద్దుతునిస్తున్నాం-సోనియా గాంధీ
New Update

లోక్ సభలో మొదలైన మహిళా బిల్లు మీద చర్చలో మొట్టమొదటగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగఉతుంది అన్నారు. పార్లమెంటుతో పాటూ అసెంబ్లీల్లో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని చెప్పారు. ఈ బిల్లుతో మహిళల సాధికారత సాధ్యమవుతుందన్నారు. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో బిల్లును అంగీకరించాలని అర్జున్ మేఘ్వాల్ కోరారు.

తరువాత మహిళా బిల్లు మీద సోనియా గాంధీ మాట్లాడారు. బిల్లుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని...త్వరగా బిల్లు అమలు అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. మ ఇక మహిళా బిల్లు ఓబీసీ కోటాను కూడా ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది నాకుచాలా ఉద్వేగభరిత క్షణం అని చెప్పారు సోనియాగాంధీ. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కల నెరవేరిందని ఆమె అన్నారు. ఆయన బతికి ఉన్నప్పుడే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని నా భర్త రాజీవ్ గాంధీ అప్పుడే బిల్లును తీసుకువచ్చారు. కానీ అది రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయింది. తర్వాత పీవీ నరసింహారావు టైమ్ లో అది అమల్లోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. దాని ఫలితమే స్థానిక సంస్థల్లో ఇప్పటివరకూ దాదాపు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారు అని సోనియా గాంధీ తెలిపారు.

అలాగే ఇప్పుడు చట్ట సభల్లో మహిళా బిల్లు కూడా ఆమోదం పొందాలని తాము కోరుకుంటున్నామని సోనియా గాంధీ అన్నారు. అయితే మహిళలఉ రాజకీయ బాధ్యతలు చేపట్టాలని తాము 13 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నామని...ఇంకా ఎంతకాలం వేచి చూడాలని ఆమె ప్రశ్నించారు. బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సోనియా డిమాండ్ చేశారు. చట్టం అమలుకు తక్షణమే కులగణన కూడా చేపట్టాలని ఆమె కోరారు.

#leader #parliment #soina-gandhi #session #woman-reservation-bill #third-day #quota #lok-sabha #congress #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe