Samantha : నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం

స్టార్ నటి సమంత తన జీవితంలో చేసిన తప్పులను ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. ఫ్యాన్స్ తో నెట్టింట చిట్ చాట్ నిర్వహించిన ఆమె లవ్, మ్యారేజ్, డివోర్స్ తదితర అంశాల గురించి మాట్లాడింది. కఠిన సమయాల్లోనే విలువైన పాఠాలు నేర్చుకుంటామని హితవు పలికింది.

Samantha : నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం
New Update

Samantha Realized : స్టార్ నటి సమంత(Samantha) మరోసారి తన పర్సనల్ లైఫ్(Personal Life) కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. నాగ చైతన్య(Naga Chaitanya) తో విడాకులు ఇష్యూ తర్వాత కొంతకాలం సోషల్ మీడియా(Social Media) కు దూరంగా ఉన్న నటి.. డివోర్స్ విమర్శలను తట్టుకుని మరింత బలంగా దూసుకొచ్చింది. వరుస సినిమాలతో చేయడంతోపాటు నెట్టింట కూడా గతానికంటే యాక్టివ్ అయింది. అయితే రీసెంట్ గా మరోసారి తన అభిమానులతో చిట్ చాట్(Chit-Chat) నిర్వహించిన నటి.. తను చేసిన మంచి, చెడుల గురించి మాట్లాడింది.

ఆలస్యంగా తెలుసుకున్నా..

ఈ మేరకు తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ పెళ్లి, ప్రేమ గురించి మరోసారి ప్రస్తావించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చేసింది. మీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి? అని ప్రశ్నించగా.. ‘నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యాను. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఎందుకంటే గతంలో నా పార్ట్ నర్ వాటిని ప్రభావితం చేశాడు. కానీ ఆ తర్వాత నన్ను నేను చెక్ చేసుకున్నా. ఏది ఏమైనా క్లిష్ట సమయాలు ఎదురైనపుడే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఇది తెలుసుకున్నప్పటి నుంచి నా పర్సనల్ లైఫ్ డెవలప్ మెంట్ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : Suhasini: చిరంజీవి హీరో కాదు..విలన్‌..అంటూ సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు!

Also Read : BREAKING: ఈ నెల 22న ఆఫ్ హాలీడే ప్రకటించిన కేంద్రం

మానసికంగా కుంగిపోయా..

అలాగే తన పెళ్లి, విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టు ముట్టడంతో మానసికంగా కుంగిపోయినట్లు చెప్పింది. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే, మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని ఆ సమయంలో చెప్పలేనంత మనోవేదనకు గురైనట్లు వెల్లడించింది.

publive-image

ఇక ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్‌’(Citadel) (ఇండియన్‌ వెర్షన్‌) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

#love-life #samantha #divorce #struggle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe