/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-18T155526.520-jpg.webp)
Samantha Realized : స్టార్ నటి సమంత(Samantha) మరోసారి తన పర్సనల్ లైఫ్(Personal Life) కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. నాగ చైతన్య(Naga Chaitanya) తో విడాకులు ఇష్యూ తర్వాత కొంతకాలం సోషల్ మీడియా(Social Media) కు దూరంగా ఉన్న నటి.. డివోర్స్ విమర్శలను తట్టుకుని మరింత బలంగా దూసుకొచ్చింది. వరుస సినిమాలతో చేయడంతోపాటు నెట్టింట కూడా గతానికంటే యాక్టివ్ అయింది. అయితే రీసెంట్ గా మరోసారి తన అభిమానులతో చిట్ చాట్(Chit-Chat) నిర్వహించిన నటి.. తను చేసిన మంచి, చెడుల గురించి మాట్లాడింది.
🫶🏻
So grateful to them https://t.co/ik2VqHWikq— Samantha (@Samanthaprabhu2) March 27, 2023
ఆలస్యంగా తెలుసుకున్నా..
ఈ మేరకు తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ పెళ్లి, ప్రేమ గురించి మరోసారి ప్రస్తావించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చేసింది. మీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి? అని ప్రశ్నించగా.. ‘నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యాను. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఎందుకంటే గతంలో నా పార్ట్ నర్ వాటిని ప్రభావితం చేశాడు. కానీ ఆ తర్వాత నన్ను నేను చెక్ చేసుకున్నా. ఏది ఏమైనా క్లిష్ట సమయాలు ఎదురైనపుడే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఇది తెలుసుకున్నప్పటి నుంచి నా పర్సనల్ లైఫ్ డెవలప్ మెంట్ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Thankyou love🫶🏻 https://t.co/PLxg6qOaUj
— Samantha (@Samanthaprabhu2) March 27, 2023
ఇది కూడా చదవండి : Suhasini: చిరంజీవి హీరో కాదు..విలన్..అంటూ సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు!
Prepare to be disneyfied😁🫶🏻#ShaakuntalamOnApril14 #ShaakuntalamIn3D https://t.co/royf27ru4p
— Samantha (@Samanthaprabhu2) March 29, 2023
Also Read : BREAKING: ఈ నెల 22న ఆఫ్ హాలీడే ప్రకటించిన కేంద్రం
మానసికంగా కుంగిపోయా..
అలాగే తన పెళ్లి, విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టు ముట్టడంతో మానసికంగా కుంగిపోయినట్లు చెప్పింది. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే, మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని ఆ సమయంలో చెప్పలేనంత మనోవేదనకు గురైనట్లు వెల్లడించింది.
ఇక ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’(Citadel) (ఇండియన్ వెర్షన్) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.