తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్

ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్‌ గ్రీన్‌ తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పాడు. గర్భంలో ఉన్నపుడే నా కిడ్నీలు సాధారణ సైజ్ లేవని వైద్యులు గుర్తించారు. 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పటికీ తన హెల్త్ బాగుందన్నాడు.

New Update
తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్

Cameron Green : ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ ప్లేయర్ కామెరూన్‌ గ్రీన్‌ తన అనారోగ్యం గురించి సంచలన విషయం బయటపెట్టాడు. తను ఈ భూమి మీద అడుగుపెట్టకముందునుంచే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నానని, ఇప్పటికీ తన హెల్త్ గురించి పేరెంట్స్ ఆందోళన చెందుతూనే ఉంటారని తెలిపాడు. అయినా తాను పెద్దగా బాధపడకుండానే కెరీర్ ను ముందుకు సాగిస్తున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెరూన్ పట్ల సానూభూతి చూపిస్తూ ఎమోషనల్ అవుతున్నారు.

కామెరూన్ గ్రీన్(Cameron Green) మాట్లాడుతూ.. ‘‘నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే నాకు కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని నా పేరెంట్స్ చెప్పారు. అయితే అప్పుడు ఇందుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కొన్నాళ్లకు ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తీసిన తర్వాత అసలు విషయం బయటపడింది. నా కిడ్నీలు సాధారణంగా ఉండాల్సినంత సైజ్ లో లేవని వైద్యులు తెలిపారు. దీంతో మా ఫ్యామిలీ మొత్తం షాక్‌ అయ్యారు. మా అమ్మ చాలా రోజులు ఒత్తిడికి గురైంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా నా ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు నా పరిస్థితి బాగానేఉంది. నిజానికి నా అదృష్టం ఏమిటంటే ఇతరుల మాదిరిగా నేను శారీరకంగా ఎక్కువ దెబ్బతినలేదు. నా ఆరోగ్య సమస్య గురించి టీమ్ లో చాలామందికి తెలుసు. కోచింగ్ సిబ్బందికీ కూడా వివరించాను. ఆహారంతోపాటు తదితర అలవాట్లను కంట్రోల్ లో ఉంచుకోవాలని వైద్యులు చెబుతుంటారు. నేను అలాగే పాటిస్తుంటాను' అని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : Sai Pallavi: నాన్న చెప్పిన నీతి మరిచిపోను.. గౌరవంగానే తప్పుకుంటా

అలాగే తన కొడుకు ఆరోగ్యం గురించి మాట్లాడిన కామెరూన్ తండ్రి గ్యారీ.. మా అబ్బాయి హెల్త్ విషయంలో చాలా ఆందోళనచెందాము. నా భార్య 19 వారాల గర్భంతో ఉన్నప్పుడు స్కానింగ్‌ తీయించగా ఈ ప్రాబ్లమ్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రీన్‌ 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పినపుడు మేము తట్టుకోలేకపోయాం. ఆ సమయంలో మా బాధ వర్ణించలేనిది. అయితే ధైర్యం కోల్పోకుండా నిరంతరం అతడి ఆరోగ్యంపై దృష్టిపెట్టాం. ఇప్పుడు గతాన్ని తలుచుకుంటే ఒక్కోసారి భయంగా ఉంటుందని గ్యారీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలావుంటే ప్రస్తుతం పాకిస్థాన్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు కామెరూన్ ఎంపిక కాలేదు. ఇక ఇండియన్ ప్రిమియర్ లీగ్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ అతన్ని వదులుకోగా రాయల్ ఛాలెంజ్ బెంగుళూర్ భారీ ధరకు దక్కించుకుంది.

Advertisment
తాజా కథనాలు