/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vj-jpg.webp)
Vijay Sethupathi : తమిళ నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వీరిద్దరూ కలిసి నటించిన ‘మెరీ క్రిస్మస్’ (Merry Christmas Movie) సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై పాజిటీవ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొంటున్న విజయ్.. మూవీలో తనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా అనిపించినప్పటికీ కత్రినాతో నటించాలంటే భయమేసిందన్నారు.
#MerryChristmas in cinemas now 🎄#SriramRaghavan @TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg @VijaySethuOffl #KatrinaKaif @realradikaa #KavinBabu #Shanmugaraja #AshwiniKalsekar #RajeshWilliams #RadhikaApte @SGayathrie #PariSharma… pic.twitter.com/ConYxeSBi0
— VijaySethupathi (@VijaySethuOffl) January 12, 2024
ఈ మేరకు విజయ్ (Vijay Sethupathi) మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తోందని చెప్పగానే షాక్ అయ్యాను. మేమిద్దరం కలిసి నటించే సన్నివేశాలు కూడా ఉన్నాయా? అని భయంగానే అడిగాను. ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పినా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నానంటే.. ఓకే అన్నారు. కానీ కత్రినా హీరోయిన్ అని చెప్పగానే ‘అది నాయికా ప్రాధాన్యమున్న సినిమానా? నువ్వు అతిథి పాత్రలో చేస్తున్నావా?’ అని అడిగారు. కత్రినా ఎంతపెద్ద నటి అనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి మొదట భయపడ్డా. కానీ సినిమా షూటింగ్ మొదలైన వారంలోనే నాలో భయాలన్ని కత్రినా పొగొట్టింది. నిజంగా ఆమె లెజెండ్ యాక్ట్రెస్' అంటూ ప్రశంసలు కురిపించారు.
My Gorgeous look in Bharat 💕#KatrinaKaif #Bollywood pic.twitter.com/noXGMlH7x0
— Katrina Kaif (@katreenakaif) February 26, 2019
ఇక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన 'మెరీ క్రిస్మస్’ ఒక సంఘటన ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది ఆసక్తికరంగా రూపొందించారు. ఇందులో విజయ్ సేతుపతి ఆల్బర్ట్‌గా నటించగా.. మరియాగా కత్రిన అదరగొట్టింది. ఈ మూవీపై కత్రిన భర్త విక్కీ కౌశల్ కూడా పొగుడుతూ పోస్ట్ పెట్టారు. ఇద్దరి నటనా అద్భుతంగా ఉందని, పాత్రలకు ప్రాణం పోశారంటూ టీమ్ మొత్తాన్ని పొగిడేశారు.
Also Read: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్