ఇలాంటి ట్రైలర్‌ నేను ఇప్పటివరకు చూడలేదు.. రణ్‌బీర్‌ను పొగిడేసిన ప్రిన్స్

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. అతను ఇండియాలోనే ది బెస్ట్‌ యాక్టర్‌ అంటూ పొగిడేశారు. ఆయనకు తాను పెద్ద అభిమానినంటూ ‘యానిమల్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

New Update
ఇలాంటి  ట్రైలర్‌ నేను ఇప్పటివరకు చూడలేదు.. రణ్‌బీర్‌ను పొగిడేసిన ప్రిన్స్

రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్‌’. రష్మిక మందన్నా హీరోయిన్ గా, బాబీ దేవోల్‌, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దూలపల్లిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మహేశ్‌బాబు, రాజమౌళి హాజరై ప్రేక్షకులను అలరించారు.

ఈ మేరకు సినిమాను ఉద్దేశించి మాట్లాడిన మహేష్ బాబు.. సందీప్‌ ఫోన్‌ చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. ఆయన అంటే నాకు ఇష్టం. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని విన్నా. నిజంగా ‘యానిమల్‌’ సినిమాపై మీరు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ అదిరిపోయింది. ఇంతటి ఒరిజినల్‌ ట్రైలర్‌ నేను ఇప్పటివరకు చూడలేదు. ట్రైలర్‌లోని అనిల్‌ కపూర్‌ సర్‌ నటన చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాబీ దేవోల్‌ యాక్టింగ్ నన్ను ఆకట్టుకుంది. రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. నటిగా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. అలాగే రణ్‌బీర్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రిన్స్.. 'రణ్‌బీర్‌ కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పాను కానీ లైట్ తీసుకున్నారు. అందుకే మరోసారి చెబుతున్నా. రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌'అంటూ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Also read : రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

అలాగే రాజమౌళి మాట్లాడుతూ.. ‘మా తెలుగు ప్రేక్షకులు ఇలా ఉంటారని బాలీవుడ్‌ వాళ్లకు చూపించాలని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఈరోజు అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, భూషణ్‌కుమార్‌లకు మిమ్మల్ని చూపిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. ఏటా కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు తెరకెక్కించి ఘన విజయాలు అందుకుంటారు. కానీ, సినిమాని ఇలానే తీయాలనే ఫార్ములాను బ్రేక్‌ చేసే దర్శకులు అరుదుగా వస్తుంటారు. అలా నాకు తెలిసిన వారిలో రామ్‌గోపాల్‌ వర్మ, సందీప్‌ రెడ్డి వంగా ఉన్నారు. టీజర్‌ చూడగానే ‘యానిమల్‌’ చిత్రాన్ని చూడాలని నిర్ణయించుకున్నా. బాలీవుడ్‌లో నా ఫేవరెట్‌ హీరో ఎవరని అడిగిన ప్రతిసారీ నా సమాధానం రణ్‌బీర్‌ కపూర్‌. అద్భుతమైన నటుడు ఆయన’ అని ప్రశంసించారు. చివరగా మాట్లాడిన రణ్‌బీర్‌.. ‘యానిమల్‌’లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సందీప్‌ రెడ్డికి థాంక్స్. అనిల్‌ కపూర్‌తో నటించాలనే నా కల నెరవేరింది. బాబీ దేవోల్‌ నా సోదరుడులాంటివారు. రష్మిక బాగా నటించింది. మహేశ్‌ బాబు ‘ఒక్కడు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంటనే ఆయనకు మెసేజ్‌ పెట్టా. ఈరోజు నా సినిమా వేడుకకు ఆయన అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు.

Advertisment
తాజా కథనాలు