HYDRA: ఆ వ్యూ ఉన్న ఇళ్లు వద్దే వద్దు.. హైడ్రాతో మారిన హైదరాబాదీల ట్రెండ్!

హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. ఇండ్లు కొనేవారికి చెరువుల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్ల గురించి అవగాహన పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో లేక్ వ్యూ బదులు ‘గార్డెన్‌ ఫేస్‌’ అంటూ బిల్డర్లు ప్రచారం మొదలుపెట్టారు.

New Update
HYDRA: ఆ వ్యూ ఉన్న ఇళ్లు వద్దే వద్దు.. హైడ్రాతో మారిన హైదరాబాదీల ట్రెండ్!

Hyderabad: హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. నగరంలో ఇల్లు, అపార్ట్ మెంట్స్, ఫ్లాట్స్ కొనేవారు ఆహ్లాదకరమైన వాతావరణానికే మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా చెరువులు, లేక్ వ్యూ పాయింట్స్ దగ్గర, కాంక్రిట్‌కు దూరంగా ఉండాలని వెతికి మరీ తీసుకుంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా దెబ్బతో జనాల లెక్కలు మారిపోయాయి. ‘లేక్‌ వ్యూ’ అంటే చాలు అబ్బో మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు. కొన్ని అపార్ట్స్ మెంట్స్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్స్ కావొచ్చనే భయంతో జనాలు కన్నెత్తి కూడా చూడట్లేదు. దీంతో అలర్ట్ అయిన బిల్డర్లు ‘గార్డెన్‌ ఫేసింగ్‌ ఫ్లాట్‌’ అనే ప్రచారం మొదలుపెట్టడం విశేషం.

‘లేక్‌ వ్యూ’ గురించి అడుగుతున్న కొత్త కస్టమర్లు..
ఈ మేరకు హైడ్రా హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పూర్తిగా మార్చేసింది. ఇండ్లు కొనేవారికి చెరువుల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్ల గురించి అవగాహన పెరిగింది. దీంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తమ వ్యూహాలు పూర్తిగా మార్చేస్తున్నారు. లేక్‌ వ్యూ మాట ఎత్తడానికి భయపడుతున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు, రెరా నిబంధనల గురించి అడిగిన వినియోగదారులు ఇప్పుడు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధి గురించే అడుగుతున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. దీంతో తక్కువ ధరలకు ఫ్లాట్లు అమ్మిన ఎవరూ రావట్లేదని, భారీగా నష్టపోతామంటూ వాపోతున్నారు. ఓ పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఐటీ కారిడార్‌లో ‘లేక్‌ వ్యూ’ పేరుతో భారీగా ప్రచారం చేసి రూ.500లకే చదరపు అడుగులు విక్రయించింది. దీంతో ఎగబడికొన్న జనాలు ఇప్పుడు వాటిని రద్దు చేసుకోవాలని చూస్తున్నారు. కొత్త కస్టమర్లు ‘లేక్‌ వ్యూ’ గురించి అడుగుతున్నారు. దీంతో ఆ సంస్థ ‘గార్డెన్‌ ఫేస్‌’గా ప్రచారం మొదలుపెట్టింది. చెరువులకు దగ్గరగా ప్రాజెక్టులు చేపట్టిన చాలా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలది అదే దారి. బిల్డర్లంతా ఫ్లాట్‌ను బుక్‌ చేసే టైమ్ లో కస్టమర్లముందు లేక్‌ వ్యూ మాట ఎత్తకూడదని నిబంధనలు పెట్టుకుంటున్నారు.

ఆ భూములు కొన్న వారి గుండెల్లో గుబులు..
ఇదిలా ఉంటే చెరువు చుట్టు భూములు కొన్న వారి గుండెల్లో గుబులు రేగుతోంది. హైడ్రాతో డిమాండ్‌ పూర్తిగా పడిపోవడంతో లబోదిబోమంటున్నారు. అప్పట్లో కస్టమర్లు కొనడానికి వచ్చినా అనుకున్న ధర రాకపోవడంతో ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కనీసం అటూ కన్నెత్తి కూడా చూడట్లేదని వాపోతున్నారు. ఇక దుర్గంచెరువు చుట్టుపక్కల నిర్మించాలనుకున్న ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మియాపూర్‌ మక్తా, నల్లగండ్ల చెరువు, దేవుని కుంట ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడుపోవట్లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు