/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/bjp-1.jpg)
Hydra Demolition : హైదరాబాద్ (Hyderabad) లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. భారీ వర్షం (Heavy Rain) లో సైతం హైడ్రా (Hydra) అధికారుల కూల్చివేతలు ఆగడం లేదు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అప్పా చెరువు FTLలో నిర్మించిన బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి కట్టడాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతల ప్రాంతాన్ని తోకల శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. అయితే, గతంలో ఇదే చెరువు కట్ట తెగి ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Also Read : ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే!