Hyderabad: ఎవరికైనా ఒకటే రూల్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. మల్లారెడ్డి, ఓవైసీ లాంటి వారి కాలేజ్‌లు కూడా బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి అయినా, ఓవైసీ అయినా అందరికీ ఒకటే రూల్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు. By B Aravind 27 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hydra Ranganath: హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది హైడ్రాకు మద్దతిస్తున్నారు. రాజకీయ వివక్ష లేకుండా ఈ సంస్థ పనిచేస్తుందా అనేదానిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు మల్లారెడ్డి, ఓవైసీ లాంటి వారి కాలేజ్‌లు కూడా బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. Also Read: మోదీకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. వచ్చే ఎన్నికల్లో విలీనం ఖాయం: జగ్గారెడ్డి! ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి అయినా, ఓవైసీ అయినా అందరికీ ఒకటే రూల్ అన్నారు. విద్యార్థులు రోడ్డున పడకూడన్నదే మా ఆలోచన అని తెలిపారు. అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకోవడం విద్యార్థులకు నష్టం చేస్తుందని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు సమయం ఇస్తామని అన్నారు. వాళ్లకు వాళ్లుగా కూల్చకపోతే హైడ్రా రంగంలోకి దిగుతుందని స్పష్టం చేశారు. Also Read: బఫర్ జోన్లో ఓవైసీ కాలేజీలు.. కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా #hydra #telugu-news #hydra-ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి