Hydra : వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్

TG: హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు చెబుతూ బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.

Hydra: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు జోన్లుగా!
New Update

Ranganath Gave Strong Warning To Blackmailers : హైడ్రా (Hydra) కు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్ల పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) హెచ్చరించారు. గత కొద్ది రోజులు ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతం అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల ను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో ఉన్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా లేదంటే హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడం జరుగుతోందని అన్నారు.

ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుటున్న అలాగే ఇతర ప్రభుత్వ విభాగలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని ఎస్పీ, సీపీకి గాని లేదా హైడ్రా కమిషనర్, ఏసిబికి కూడా ఫిర్యాదు చేయాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మంచి ఉద్యేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు గాని, తప్పు దోవ పట్టించే విధంగా యత్నించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగంపేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

Also Read : ఏపీకి అస్నా తుఫాన్‌ ముప్పు

#telangana #illegal-construction #ranganath #hydra-commissioner
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe