Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు.

Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు
New Update

Biryani & Haleem Orders For Ramadan: పండుగ ఏదీ, ఎవరిది అనవసరం...బిర్యానీ ఉండాల్సిందే. తినాల్సిందే. అసలు బిర్యానీ పేరు చెపితేనే నోట్లో నీళ్ళూరుతాయి. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ లాంటిది మరెక్కడా దొరకదు కూడా. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బిర్యానీని రంజాన్ మాసంలో (Ramadan 2024) హైదరాబాదీలు తెగ తినేశాంట. నెల రోజుల వ్యవధిలోనే పదిలక్షల పేట్ల బిర్యానీ తిన్నారంటే..అర్ధం చేసుకోవచ్చను హైదరాబాదీలకు ఇది అంటే ఎంత మక్కువో. ఇప్పుడు ఈ లెక్క చెబుతున్నది కూడా ఒక్క స్విగ్గీనే (Swiggy). కేవలం ఈ ఫుడ్ డెలివరీ సంస్థ ద్వారానే పదిలక్షల బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అదే జొమాటో, డైరెక్ట్‌గా వెళ్ళి తినడం లాంటివి కలుపుకుంటే ఈ సంఖ్య అపరిమితంగా పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మార్చి 11న ప్రారంభం అయిన రంజాన్ మాసం ఇవాల్టితో ముస్తుంది. ఇక మాసంలో బిర్యానీతో పాటూ చెప్పుకోవల్సింది..హైదరాబాద్‌కుమాత్రమే ప్రత్యేకమైనది హలీం. దీన్ని కూడా ఈ నెల రోజుల్లో విపరీతంగా తిన్నారని చెబుతోంది స్విగ్గీ. మొత్తం 5.3 లక్షల ప్లేట్ల హలీం ఆర్డర్ చేశారు. రంజాన్‌ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ఇది ఒక రికార్డేనని అంటోంది స్విగ్గీ.

స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లలో ఎక్కువగా చికెన్‌, మటన్‌ బిర్యానీ, హలీమ్‌, సమోసా, ఫలుదా, ఖీర్‌ ఉన్నాయని చెబుతోంది. గత ఏడాది కన్నా మొత్తంగా హలీమ్‌ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్ని 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్‌ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని చెప్పింది.

Also Read:Telangana : టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్‌రావుపై మరో కేసు

#hyderabad #biryani #orders #ramadan #haleem
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe