Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం

హైద‌రాబాద్ మ‌హిళా క్రికెట‌ర్లకు చేదు అనుభ‌వం ఎదురైంది. వాళ్ళకు సరైన మార్గాన్ని చూపించాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కోచ్‌ను సస్పెండ్ చేసింది హెచ్సీఏ.

Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం
New Update

Hyderabad woman cricketers coach misbehave:హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ ఆటను మెరుగుపరుస్తూ..నిత్యం తమతో ఉండే కోచ్‌ నుంచే వారికి అనుకోని సంఘటన ఎదురైంది. ట్రైనింగ్ ఇవ్వాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన చేదు అనుబవం ఎదురయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. మ్యాచ్ కోసం మ‌హిళా క్రికెట‌ర్ల హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు విమానంలో రావాల్సి ఉంది. అయితే.. కావాల‌నే కోచ్ జైసింహా ఆల‌స్యం చేయ‌డంతో ప్లైట్ మిస్ అయింది. దీంతో వారంతా బ‌స్‌లో విజవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. వస్తున్న దారిలో జైసింహ బస్సులోనే మందు తాగాడు. తమ ముందు తాగొద్దని ఎంత చెబుతున్నా వినలేదు. పైగా కోపంతో నానా మాటలు మాట్లాడాడు. బండ బూతులు తిట్టాడు. తనను ఎవరైనా ఎదిరిస్తే టీమ్‌లో నుంచి తీసేస్తానని బెదిరించాడు కూడా.

Also Read:Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

హెచ్సీఏలో పిర్యాదు..
సంఘటన జరిగాక హైదరాబాద్ వచ్చిన క్రికెటర్లు వెంటనే హచ్సీఏలో ఫిర్యాదు చేశారు. బస్సులో తతంగం అంతా జరుగుతున్నప్పుడు సెల‌క్షన్ క‌మిటీ మెంబ‌ర్ పూర్ణిమ‌రావు బ‌స్‌లోనే ఉన్నారు. తాను ఒక మమిళ అయి ఉండి ఆమె.. జై సింహాను అడ్డుకోలేదు స‌రిక‌దా ఇంకా ఎంక‌రేజ్ చేసింది. వీళ్ళిద్దరి మీద మహిళా క్రికెటర్లు కంప్లైంట్ చేశారు. పూర్నిమా రావు, జైసింహల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే హెచ్సీఏ ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అతని మీద క్రిమినల్ కేసు కూడా పెడతామనిచెప్పారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదని చెబుతున్నారు జగన్మోహనరావు. ఇప్పుడు జరిగిన సంఘటన మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతామని తెలిపారు. దాంతో పాటూ విచారణ ముగిసే వరకూ జైసింహను సస్పెండ్ చేశారు.

#hyderabad #misbehave #coach #women-crickeres #jai-simha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe